Telangana

IRCTC Shirdi Tour 2024 : మరింత తగ్గిన ‘షిర్డీ’ ట్రిప్ ధర



హైదరాబాద్ – షిర్డీ టూర్ షెడ్యూల్:ఫస్ట్ డే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (అజంతా ఎక్స్ ప్రెస్) నుంచి సాయంత్రం 06.50 నిమిషాలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం 07.10 నిమిషాలకు నాగర్ సోల్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి వెళ్తారు. హెటల్ లోకి చెకిన్ అవుతారు. అనంతరం షిర్డీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఆ తర్వాత శని శిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంటి నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు బయల్దేరుతారు. రాత్రి 08 .30 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు. మూడో రోజు ఉదయం 08.50 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.షిర్డీ టూర్ టికెట్ ధరలు:Hyderabad Shirdi Tour Prices 2024: హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 7790 గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 6560 ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6550గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 4910గా ఉంది. గతేడాది డిసెంబర్ లో ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 8,680 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ.7,010ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 6,840గా నిర్ణయించారు. కంఫార్ట్ క్లాస్ల్ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. గతంలో ఉన్న ధరలతో పోల్చితే… ప్రస్తుతం ధరలు తగ్గాయి. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చూడండి. https://www.irctctourism.com/ క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.



Source link

Related posts

Todays top ten news at Telangana Andhra Pradesh 3 March 2024 latest news | Top Headlines Today: మజ్లిస్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా?; వైసీపీపై చంద్రబాబు కామెంట్స్

Oknews

కొరడా ఝళిపించిన ఈసీ- కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటు-telangana election commission transfers collectors sps hyderabad cp cv anand transferred to khammam ,తెలంగాణ న్యూస్

Oknews

IRCTC Kashmir Tour : భూతలస్వర్గం ‘కశ్మీర్’ లో 6 రోజులు

Oknews

Leave a Comment