ByGanesh
Sat 17th Feb 2024 11:47 AM
స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఫీవర్ నుంచి బయటపడి సరదాగా ఏసీ థియేటర్ లో సినిమాలు చూస్తూ ప్రతి సమ్మర్ ని ఎంజాయ్ చూస్తూ ఉంటారు. ఎంతగా వెకేషన్స్ కి వెళ్ళినా, అమ్మమ్మగారి ఇంటికి వెళ్లి అడ్డుకున్నా ఏదో ఒక సినిమా అయితే చూడకుండా పిల్లలు ఉండరు, పెద్దలూ ఉండరు. యూత్ అయితే చెప్పక్కర్లేదు సమ్మర్ హాలిడేస్ లో విడుదలయ్యే భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాల కోసం బాగా వెయిట్ చేస్తారు. అందుకే మేకర్స్ ఎక్కువగా సమ్మర్ సెలవల్లో సినిమాలు విడుదల చేసేందుకు మొగ్గు చూపిస్తూ ఉంటారు, ఆ వేసవి సెలవలని క్యాష్ చేసుకునేందుకు ప్లానింగ్ లో ఉంటారు. ఏప్రిల్ చివరి వారం, మే మొదటి వారంలో అలాగే మే చివరి వారంలో పెద్ద సినిమాలు బాక్సాఫీసుని టార్గెట్ చేస్తూ ఉంటాయి.
కానీ ఈ సమ్మర్ లో అలాంటి పెద్ద సినిమాల రిలీజ్ లు ఏమి కనిపించడమే లేదు. టాలీవడ్ స్టార్ హీరోలు ఎవ్వరూ ఈ సమ్మర్ లో తమ సినిమాలని రిలీజ్ చెయ్యడం లేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మే 9 న కల్కి తో రాబోతున్నట్టుగా మేకర్స్ డేట్ అనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు ఆ డేట్ మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోపక్క ఏప్రిల్ 5 న రావాల్సిన ఎన్టీఆర్ ఏకంగా అక్టోబర్ కి వెళ్ళిపోయాడు. ఇక అల్లు అర్జున్ ఆగష్టు 15 కి పుష్ప తో వస్తున్నాడు. మరో స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డేట్ పై క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ OG సెప్టెంబర్ చివరి వారంలో రాబోతుంది.
అంటే ఈ సమ్మర్ కి ఏ స్టార్ హీరో బాక్సాఫీసుని షేక్ చేసే ఉద్దేశ్యంలో లేరు. మరోపక్క సీనియర్ హీరోగా చిరు విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతి కి వస్తుంది. బాలయ్య-బాబీ చిత్రం ఆగష్టు కానీ దసరా కానీ అంటున్నారు. నాగ్ తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేదు, వెంకీ కూడా అంతే. మిగతా మీడియం రేంజ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, సిద్దు టిల్లు స్క్వేర్ లు ఎమన్నా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తే ఓకే.. లేదంటే ఈ సమ్మర్ మాత్రం బోర్ కొట్టడం ఖాయం.
Is summer boring..:
A summer without big movies