ByGanesh
Thu 22nd Feb 2024 07:48 PM
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత చేస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకుడిగా ప్యాన్ ఇండియా అప్పీల్ తో తెరకెక్కుతున్న దేవర చిత్రం ఏప్రిల్ 5 కి విడుదలకావాల్సి ఉండగా.. మేకర్స్ దానిని అక్టోబర్ కి పోస్ట్ పోన్ చేసారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా అతిలోక సుందరి శ్రీదేవి పెద్దకుమర్తె జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇప్పటికే జాన్వీ కపూర్ దేవర లుక్ అందరిని ఇంప్రెస్స్ చేసింది. ఈమధ్యనే బోని కపూర్ తన కూతురు జాన్వీ కపూర్ దేవర సెట్స్ లో ఎంజాయ్ చేస్తూ పని చేసుకుంటుంది అని చెప్పారు.
తాజాగా జాన్వీ కపూర్ దేవర ముచ్చట్లు చెప్పుకొచ్చింది. తాను ఇంకా ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నాను అని, పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది, తాను దేవర షూటింగ్ ని ప్రతి రోజు ఎంజాయ్ చేస్తున్నట్టుగా చెప్పడమే కాకుండా ఈ సినిమా పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్ దేవర పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి ఈ చిత్రంతో పాటుగా జాన్వీ మరో భారీ బడ్జెట్ తెలుగు మూవీలో చరణ్ సరసన హీరోయిన్ గా కన్ ఫర్మ్ అయ్యింది.
Janhvi Kapoor about Devara update:
Janvhi Kapoor drops exciting update from Jr NTR starrer Devara