చంపాయ్ సోరెన్ ఎవరు?హేమంత్ సోరెన్ రాజీనామా, అరెస్ట్ నేపథ్యంలో…. 67 ఏళ్ల గిరిజన నేతగా పేరొందిన చంపాయ్ సోరెన్ జార్ఖండ్ 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పు సింగ్భూమ్, పశ్చిమ సింగ్భూమ్, సెరైకెలా-ఖర్సావన్ జిల్లాలతో కూడిన జార్ఖండ్లోని కొల్హాన్ ప్రాంతం నుంచి ఆయన ఆరో సీఎం. చంపాయ్ సోరెన్ సరైకెలా-ఖర్సవాన్ జిల్లాలోని జిలింగ్గోడా గ్రామానికి చెందిన రైతు సిమల్ సోరెన్ పెద్ద కుమారుడు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Source link