పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం కల్కి 2898 AD భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నాగ్ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం, టాప్ స్టార్స్ కల్కిలో భాగమవడం అన్ని కల్కి పై అంచనాలు పెరిగేలా చేసాయి. కల్కి డే అంటూ ప్రభాస్ అభిమానులు ఈరోజు థియేటర్స్ దగ్గర పటాసులు పేలుస్తూ, పేపర్స్ చింపుతూ రచ్చ చేస్తున్నారు. ప్రభాస్ భారీ కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలతో హోరెత్తిస్తున్నారు.
మరి కల్కి ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తి కావడమే కాదు.. అక్కడి ప్రేక్షకులు కల్కి 2898 AD మూవీ పై తమ ఒపీనియన్ ని షేర్ చేస్తూ వాళ్ళు హడావిడి చేస్తున్నారు. కల్కి ఓవర్సీస్ యుఎస్ డల్లాస్ లో సినిమాని వీక్షించిన కొంతమంది ఆడియన్స్ స్పందన మీ కోసం..
కల్కి షో మొదలైన 20 నిమిషాలకి ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది, ప్రభాస్ ఎంట్రీ సీన్ అదుర్స్, ప్రభాస్ మేకోవర్, అమితాబచ్చన్ డైలాగ్స్, నాగ్ అశ్విన్ దర్శకత్వం, సెకండ్ హాఫ్ అన్ని సూపర్బ్ గా ఉన్నాయి. విజువల్ వండర్ గా కల్కి 2898 AD ఉంది.. అందులో సందేహం లేదు. టెక్నీకల్ గా నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
కల్కి లో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కానివ్వండి, అవసరం లేని సీన్స్ లాగ్, మ్యూజిక్, సాంగ్స్, మరీ ముఖ్యంగా సౌండ్ మిక్స్ ప్రేక్షకులని ఇబ్బంది పెట్టేశాయి. అంతెకాకుండా ప్రభాస్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ కి అర్ధమవలేదనే అభిప్రాయాలూ ఓవర్సీస్ ఆడియన్స్ వ్యకం చేస్తున్నారు. BGM , సాంగ్ మేజర్ మైనస్ గా మాట్లాడుతున్నారు. ఓవరాల్ గా కల్కి యావరేజ్ నుంచి ఎబో యావరేజ్ అంటూ ఓవర్సీస్ ఆడియన్స్ తేల్చేస్తున్నారు.
మరికాసేపట్లో ఇండియా షోస్ కూడా పూర్తవుతాయి.. మరి కల్కి 2898 AD ఫుల్ రివ్యూ కోసం కాస్త వెయిట్ చెయ్యండి.. వచ్చేస్తుంది.