Dr BN Rao is a health provider for the poor : వైద్యోనారాయణుడు అంటారు పెద్దలు . అంటే వైద్యం అందించే వైదుడు కూడా ఆ దేవుడితో సమానం అని అర్ధం. అలాంటి వైద్యుడే కరీంగనర్ జిల్లాకు చెందిన డాక్టర్ బీఎన్ రావు. కేవలం వైద్య చికిత్స చేయడమే కాదు మానవ సేవే మాధవ సేవ అంటూ బిన్ రావు ఫౌండేషన్ పేరుతో నిరుపేదలకు, కేన్సర్ రోగులకు మెడికల్ స్టూడెంట్స్ కు తన వంతు సాయం చేస్తూ అండగా ఉంటున్నారు. పేదల పాలిట పెన్నిధి గా నిలుస్తూ నలుగురికి స్పార్తిదాయకంగా నిలుస్తున్న డాక్టర్ బీఎన్ రావు అనేక అవార్డులు తెచ్చుకున్నారు.
35 ఏళ్లుగా వైద్య వృత్తిలో బీఎన్ రావు !
కరీంనగర్ జిల్లా పెగడాపల్లి మండలానికి చెందిన డాక్టర్ బిఎన్ రావు {రేమాటాలజిస్ట్ }1981 లో డాక్టర్ వృత్తి ని ప్రారంభించారు .35 సంవత్సరాల తన సుదీర్ఘ కలం లో ఎంతో మందికి వైద్య సేవలు అందించారు .తన వద్దకు వచ్చే వారంతా కూడా నిరుపేద కుటుంబాలు, రైతులు నుంచే వస్తుంటారు .తన వద్దకు వచ్చేవారికి ఎక్కువ శాతం మోకాళ్ళ సమస్యలతోనే వస్తుంటారు .మరి కొంత మందికి మందులతో నయం ఐనప్పటికీ కొంతమందికి మాత్రం తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిందే .కానీ ఈ మోకాలు మార్పిడి కి అయ్యే ఖర్చు సుమారుగా రెండు లక్షల వరకు అవుతుంది .మరి అంతటి ఖర్చు పెట్టి మోకాలు మార్పిడి చేయించుకోవడం అందరి తో అయ్యే పని కాదు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఐనా వారికైతే అసాధ్యం అనే చెప్పుకోవచ్చు. అలాంటివారికోసమే బి ఎన్ రావు ఫౌండేషన్ ద్వారా పేదలకు తవంతు సాయంగా ఉచితంగా మోకాలు మార్పిడి చేస్తున్నారు డాక్టర్ బిన్ రావు .
బెస్ట్ కమ్యూనిటీ సర్వీస్ కింద జాతీయ అవార్డు
డాక్టర్ బీఎన్‌రావు తన పేరిట స్థాపించిన బీఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ ద్వారా కొన్నేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 30వేల మంది విద్యార్థులకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి 7వేల మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరికి ఐరన్ మాత్రలతో పాటు బెల్లం పట్టీలు, పండ్లు మూడు నెలల పాటు ఉచితంగా పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రెండు విడుతలుగా చేపట్టారు. వీటితో పాటు కరోనా సమయంలో మున్సిపల్, పారా మెడికల్, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్స్, శానిటైజర్లు, మాస్క్‌లు, ప్రభుత్వ దవాఖానకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఉచితంగా అందజేసినందుకుగాను బీఎన్ రావుకు వ్యక్తిగతంగా బెస్ట్ కమ్యూనిటీ సర్వీస్ కింద జాతీయ అవార్డు దక్కింది.
2017లో బీఎన్ రావు ఫౌండేషన్ స్థాపన
2017 లో బిఎన్ రావు ఫౌండేషన్ స్థాపించారు. ఇప్పటి వరకు 28 మంది కి మోకాలు మార్పిడి చేయించామని బీఎన్ రావు అంటున్నారు .ఎంతో అరుదైన ఈ వైద్య చికిత్స చేయించుకోవాలంటే అందరితో సాధ్యం కాదు కాబట్టే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు . తన వద్దకు రైతులు , మారుమూల ప్రాంతాలనుంచి ఎక్కువ శాతం నిరుపేదలే వస్తుంటారని ఆపరేషన్ చేయించుకునే స్థోమత కూడా ఉండదని అన్నారు . అందుకే తన వంతు సహాయంగా ఇలా చేస్తున్నానని అన్నారు .అంతే కాకుండా కరోనా సమయం లో కరీంనగర్ జిల్లా కేశవపట్నం గ్రామానికి చెందిన వెంకటేష్ కరోనా తో మరణించారు అతని 10 సంవత్సరాల కుమారుడు ప్రస్తుతం బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్నాడు తనకి కూడా ఫౌండేషన్ ద్వారా చికిత్స కోసం ఆర్థిక సహాయాన్ని అందించానని , పేద విద్యార్థులకు కూడా సహాయం చేసానని అన్నారు. మానవుడిగా పుట్టినందుకు మనకంటూ మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నానని బీఎన్ రావు చెబుతున్నారు.
మరిన్ని చూడండి