ByGanesh
Sat 24th Feb 2024 10:19 AM
ఒకవైపు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ తహతహలాడుతుంటే.. మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవితను జైలుకు పంపించాలని బీజేపీ యోచిస్తోంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా ఈడీ చేర్చడంతో ఆమె అరెస్ట్ ఖాయమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కవితను గతంలోనూ మూడు పర్యాయాలు ఈడీ విచారించింది. రెండోసారి, మూడోసారి విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం బీభత్సంగా జరిగింది. కానీ ఈడీ అరెస్ట్ చేయలేదు. పైగా ఇప్పటి వరకూ కేసులో ఎలాంటి కదలికా లేదు. ఈ లోపే కవితన సుప్రీంకోర్టును ఆశ్రయించి తనను ప్రశ్నించడంపై మినహాయింపును తెచ్చుకున్నారు.
అక్కడే కేసులో కీలక మలుపు..
అయితే అనూహ్యంగా శుక్రవారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కవితను నిందితురాలిగా పరిగణిస్తూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు పలువురు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లు, దర్యాప్తు పూర్తయిన తర్వాతనే కవితకు నోటీసులు ఇచ్చామని సిబిఐ అధికారులు చెబుతున్నారు. గతంలో కవితను సీబీఐ సాక్షిగానే పరిగణించింది. తాజాగా 41 ఏ నిబంధన కింద ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్‌గా మారడంతో పాటు కవిత పీఏ అశోక్ వాంగ్మూలంతో కేసు కీలక మలుపు తీసుకుంది. ఆయన దర్యాప్తు అధికారులకు చెప్పిన విషయాలతో కవితను ఈ కేసులో నిందితురాలిగా చేర్చడం జరిగిందని తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎంత బలహీనపడితే అంత లాభం..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ బీభత్సంగా ప్రచారం జరిగింది. అందుకే కవితను అరెస్ట్ చేయడం లేదని టాక్ నడించింది. మరి ఇంత సడెన్‌గా ఈ కేసులో కవితను నిందితురాలిగా చేయడం వెనుక మతలబ్ వేరే ఉందని తెలుస్తోంది. అదేంటంటే.. బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలన్నింటినీ ఇప్పుడు తుడిపేయాలని బీజేపీ భావిస్తోందట. పైగా తెలంగాణలో బీఆర్ఎస్ ఎంత బలహీనపడితే అంత లాభమని బీజేపీ యోచనగా తెలుస్తోంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీఆర్ఎస్‌ను ఇరుకున పెడుతోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలన్నింటినీ వెలికితీసే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో పార్టీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. తద్వారా బీఆర్ఎస్‌కు ఓటమి అవకాశాలు పెరిగి.. బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట. అందుకే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటే కవితను కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.
Kavitha as the accused.. there is a big story!:
The weaker BRS, the more profit.