BRS Bforms : సోమవారం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ మరో 28 మంది అభ్యర్థులకు బి ఫారాలు అందజేశారు. మొత్తం 28 మంది అభ్యర్థులు ఇవాళ మధ్యాహ్నం బీపారాలు తీసుకున్నారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 97 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు బిఫారాలు తీసుకున్నారు.
నేడు బీ ఫారాలు అందుకున్న అభ్యర్ధులు వీరే..
1. సంజయ్ కల్వకుంట్ల
2. డా. ఎన్ . సంజయ్ కుమార్
3. కొప్పుల ఈశ్వర్
4. కోరుకంటి చందర్
5. పుట్ట మథు
6. చింత ప్రభాకర్
7. చామకూర మల్లారెడ్డి
8. కె పి వివేకానంద్
9. మాధవరం కృష్ణారావు
10. మంచికంటి కిషన్ రెడ్డి
11. సబితా ఇంద్రారెడ్డి
12. టి. ప్రకాశ్ గౌడ్
13. కాలె యాదయ్య
14. కొప్పుల మహేశ్ రెడ్డి
15. మెతుకు ఆనంద్
16. ముఠా గోపాల్
17. కాలేరు వెంకటేశ్
18. దానం నాగేందర్
19. మాగంటి గోపీనాథ్
20. టి. పద్మారావు
21. లాస్య నందిత
22. గొంగిడి సునీత
23. శానంపూడి సైదిరెడ్డి
24. డి.ఎస్.రెడ్యానాయక్
25. బానోత్ శంకర్ నాయక్
26. చల్లా ధర్మారెడ్డి
27. ఆరూరి రమేశ్
28. గండ్ర వెంకట రమణారెడ్డి
ఆదివారం రోజు రెండు విడతలుగా 69 మందికి బీఫాం ఇచ్చారు. బీఫాం రాని వాళ్లు టెన్షన్ పడుతున్నారు. అయితే కేసీఆర్ మత్రం అందరికీ బీఫాంతో పాటు ఎన్నికల ఖర్చుల కోసం చెక్కులు ఇస్తున్నారు. వ అన్ని పత్రాలతో పక్కాగా ఉండేలా బీఫామ్స్ రెడీ చేస్తున్నారు. అందుకే సిద్ధమైన వారందరికీ బీఫామ్స్ ఇస్తున్నారు. ఇప్పటికి 97 మందికి బీఫామ్స్ ఇచ్చారు. మిగిలిన వారికీ రెండు, మడు రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది.
అయితే కొంత మందిని మారుస్తారని ప ్రచారం జరుగుతున్న సమయంలో… బీఫామ్స్ పెండింగ్ లో పెట్టడం నేతల్లో టెన్షన్ కు దారి తీస్తోంది. టిక్కెట్లు ప్రకటించినప్పటికీ కొందరికి నిరాకరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బీఫామ్స్ పెండింగ్ లో ఉన్న వారిలో కొందరు దురదృష్ట వంతులు ఉండవచ్చని చెబుతున్నారు.
ఆలంపూర్ అభ్యర్థిని మారుస్తారా ?
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వంపై గులాబీ బాస్ నిర్ణయం మార్చుకున్నారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. అందుకే.. అభ్యర్థిగా అబ్రహం పేరు ప్రకటించినప్పటికీ ఆదివారం నాడు బీఫామ్ ఇవ్వలేదు. అలంపూర్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపే యోచనలో అధిష్టానం ఉంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నిశితంగా పరిశీలన చేసి మరో నేతను బరిలోకి దింపాలని రిపోర్టు ఇచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు స్థానిక నేత విజయుడి పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా స్వయంగా కేసీఆరే ప్రకటించబోతున్నారని తెలిసింది. దీంతో బీఫామ్‌లు దక్కని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అంటున్టనారు. అయితే ఇలాంటి దురదృష్టవంతులు చాలా తక్కువ మంది ఉంటారని చెబుతున్నారు.