దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు.. గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. దేశంలో పదవిలో ఉన్న ఒక సీఎం అరెస్ట్ అవ్వడం ఇదే తొలిసారి! ఇదే కేసులో.. బీఆర్ఎస్ నేత కవిత, ఆమ్ ఆద్మీ నేత- దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్‌లు ఇప్పటికే జైలులో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ.. జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ చెబుతోంది. కానీ.. నైతిక బాధ్యత వహిస్తూ, ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. వీటన్నింటి మధ్య.. దిల్లీవ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలకు ప్రణాళికలు రచిస్తోంది ఆమ్ ఆద్మీ. ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.
Source link