Brs Chief Kcr Meet Farmers: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం (మార్చి 31) 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్న రైతుల్లో ధైర్యం నింపేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. నేడు నల్గొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించి, ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. రైతులను పరామర్శించి వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెబుతారని పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి సహా పలువురు నేతలు క్షేత్రస్థాయిలో పంటల్ని పరిశీలించి రైతులకు తక్షణమే పంట నష్టం సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పూర్తి షెడ్యూల్ ఇదే..- ఆదివారం (మార్చి 31న) ఉదయం 8:30 గంటలకు కేసీఆర్ జిల్లాల పర్యటనకు ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరతారు. తొలుత ఉదయం 10:30 గంటలకు జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు చేరుకుంటారు. అనంతరం అక్కడ ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు.
– ఆదివారం ఉదయం 11:30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. రైతులకు సాగునీటి సమస్యలు, అకాల వర్షాలతో జరిగిన నష్టంపై అడిగి తెలుసుకుంటారు.
– మధ్యాహ్నం 1:30ల గంటకు సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు కేసీఆర్ చేరుకుంటారు. మధ్యాహ్నం భోజనం అనంతరం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు.
– మధ్యాహ్నం 3:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నల్లగొండ జిల్లాకు బయల్దేరుతారు. సాయంత్రం 4:30 గంటలకు కేసీఆర్ నిడమనూరు మండలంలో ఎండిన పంటల్ని పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. నేటి సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి రోడ్డు మార్గంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి చేరుకుంటారని షెడ్యూల్ విడుదల చేశారు.
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క ఎకరాకు రూ.20, 25 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సాయం అందజేసి రైతనన్నలను ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవలేదని, సీఎం రేవంత్ రెడ్డికి రైతుల బాధలు పట్టవని విమర్శించారు.
మరిన్ని చూడండి
Source link