ByGanesh
Fri 22nd Sep 2023 10:14 PM
మెగా ఫ్యామిలోకి ఇంకా చిన్న కోడలిగా ఎంట్రీ ఇవ్వకముందే లావణ్య త్రిపాఠి ఎప్పుడో అఫీషియల్ గా తన అత్తారింట్లోకి కాలు పెట్టేసింది. వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధం జరిగింది నాగబాబు ఇంట్లో. ఇక మొన్న వినాయక చవితి పూజ ని కాబోయే అత్తమామలతో కలిసి నాగబాబు ఇంట్లోనే చేసింది. అందుకే మెగా చిన్నకోడలు అంటూ సంభోదించింది.
ఇక వరుణ్ తేజ్ తో నవంబర్ లో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్న లావణ్య త్రిపాఠి ఇప్పటికే కాబోయే వాడితో కలిసి షాపింగ్ మొదలు పెట్టేసింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైనర్ షాప్ లో పెళ్లి దుస్తుల్ని సెలెక్ట్ కూడా చేసారు. మిగతా పనులని కూడా వరుణ్ తో కలిసి లావణ్య అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. అయితే వీరి వివాహం హైదరాబాద్ లో జరగడం లేదు. ఇటలీ వేదికగా వరుణ్ తేజ్ లావణ్యని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడు.
తాజాగా లావణ్య త్రిపాఠి శారీ లో కొత్తగా మెరిసిపోయింది. వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో లావెండర్ శారీ లో చాలా అంటే చాలా అందంగా కనిపించింది. లూజ్ హెయిర్ లో కనిపించినా, లావణ్య మొహంలో మాత్రం పెళ్లి కళ కొటొచ్చినట్టుగా కనిపిస్తుంది. అన్నట్టు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటిస్తుందా లేదా అనేది పక్కనబెడితే.. ఆమె వరుణ్ తేజ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
Lavanya Tripathi in a traditional saree:
Lavanya Tripathi Posts Stunning Photos In Saree