ByMohan
Wed 27th Mar 2024 10:28 AM
మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈమధ్యన సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటుంది. మెగా హీరో వరుణ్ తేజ్ ని పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న లావణ్య త్రిపాఠి తన గ్లామర్ ప్రపంచాన్ని ఎన్నటికీ వదిలేదే లేదు అని ఎప్పుడో చెప్పింది. వరుణ్ తేజ్ తనని అర్ధం చేసుకుంటాడు.. కాబట్టే నటనని కంటిన్యూ చేస్తాను అని చెప్పిన లావణ్య త్రిపాఠి తాజాగా వరుణ్ తేజ్ తో కలిసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ షేర్ చేసింది.
ఇప్పుడు ఆమె సోలో ఫొటోస్ ని సోషల్ మీడియాలో పంచుకుంది. మిర్రర్ లో కనిపిస్తున్న పిక్స్ ని షేర్ చేసిన లావణ్య త్రిపాఠి స్టైలిష్ గా మోడ్రెన్ గా కనిపించింది. లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో కనిపించింది. లావణ్య కొత్త స్టయిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక లావణ్య కెరీర్ కి వస్తే.. ఆమె నటించిన వెబ్ సీరీస్ రీసెంట్ గానే విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఆమె చేతిలో తెలుగులో ఎలాంటి ప్రాజెక్ట్స్ అయితే ప్రస్తుతానికి లేవు.
Lavanya Tripathi Mirror Look Goes Viral:
Lavanya Tripathi Latest Pic Creates Sensation