GossipsLatest News

Maharaja vs Harom Hara మహారాజ రూపంలో సుధీర్ బాబుకి గండం



Sun 16th Jun 2024 07:16 PM

vijay sethupathi  మహారాజ రూపంలో సుధీర్ బాబుకి గండం


Maharaja vs Harom Hara మహారాజ రూపంలో సుధీర్ బాబుకి గండం

విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ మూవీ మహారాజ. ఈ చిత్రం ప్రీమియర్స్ తోనే సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళంలోనే కాదు.. తెలుగు ఆడియన్స్ కూడా మహారాజ చిత్రానికి సూపర్ హిట్ టాక్ ఇవ్వడంతో పాటుగా క్రిటిక్స్ కూడా బ్లాక్ బస్టర్ రివ్యూస్ ఇవ్వడంతో తెలుగు ఆడియన్స్ మహారాజ థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు మహారాజా చిత్రం సుధీర్ బాబు హరోం హరికి అలాగే ఇంకా తెలుగులో విడుదలైన మిగతా సినిమాలకి చెక్ పెట్టింది. 

కొద్దిరోజులుగా సక్సెస్ కోసం పరితపిస్తున్న సుధీర్ బాబు కి హరోంహర చిత్రం రిజల్ట్ కాస్త ఊరటనిచ్చింది. హరోంహర చిత్రానికి హిట్ టాక్ రాకపోయినా క్రిటిక్స్ నుంచి, ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ రావడం తో మేకర్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. అందులోను మూడు రోజుల సెలవలతో ప్రేక్షకులకి వేరే ఆప్షన్ ఉండదు. 

సో సుధీర్ బాబు హరోం హరికి ఆడియన్స్ వెళతారనుకుంటే.. ఇప్పుడు మహారాజ రూపంలో గండం వచ్చి పడింది. ఈ వారం గనక మహారాజ లేకుండా కేవలం హరోంహర మాత్రమే వచ్చి ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా హరోం హర ని చూజ్ చేసుకునేవారు. అలాగే హరోం హరాకి ఇంకాస్త పాజిటివ్ టాక్ వచ్చినా విజయ్ సేతుపతి సినిమాకి ఆడియన్స్ తగ్గేవారు. 

కానీ ఇప్పుడు మహారాజ మౌత్ టాక్ సుధీర్ బాబు హరోం హర పై ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం ఈ 3 డేస్ హరోం హరికి ఆక్యుపెన్సీ బాగానే ఉన్నా మంగళవారం పెరఫార్మెన్స్ బట్టి డిసైడ్ అవుతుంది దీని రిజల్ట్ ఏమిటి అనేది.!


Maharaja vs Harom Hara:

Vijay Sethupathi vs sudheer Babu









Source link

Related posts

Todays top five news at Telangana Andhra Pradesh 14 March 2024 latest news | Top Headlines Today: బీజేపీ కీలక నేత ఇంటికి రేవంత్; సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Oknews

హైదరాబాద్ ఇలా ఉందంటే రీజన్ చంద్రబాబునాయుడు!

Oknews

రాజమౌళి దెబ్బకి నష్టపోయిన కమెడియన్.. ఫోన్ చేసిన శ్రీముఖి

Oknews

Leave a Comment