ByMohan
Wed 13th Mar 2024 10:38 AM
ఫిబ్రవరి 9న విడుదలైన మలయాళ చిత్రం ప్రేమలు.. అక్కడ మంచి విజయం సాధించడంతో.. ఆ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ.. అదే టైటిల్‌తో తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట మంచి స్పందనను రాబట్టుకుంటూ.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాని చూసిన ప్రముఖులందరూ సోషల్ మీడియా వేదికగా.. సినిమాపై, అలాగే సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన కార్తికేయపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాపై తన రివ్యూని తెలియజేశారు. ఆద్యంతం ఎంజాయ్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు.
తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు చిత్రాన్ని అందించిన కార్తికేయకు థ్యాంక్స్. సినిమా అంతా బాగా ఎంజాయ్ చేశాను. చివరిగా నేను ఏ సినిమాకు ఇలా నవ్వుకున్నానో కూడా గుర్తులేదు. ఫ్యామిలీ మొత్తానికి ఈ సినిమా నచ్చింది. సినిమాలో నటించిన యంగ్‌స్టర్స్ అందరూ టాప్ క్లాస్ నటనను కనబరిచారు. చిత్ర టీమ్ మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తున్నానంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులైతే.. మంచి సినిమాను ప్రమోట్ చేయడంతో మా బాబు ఎప్పుడూ ముందుంటాడనేలా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే మహేష్ బాబు.. తనకు సినిమా నచ్చితే.. ఇలా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు. ఎప్పటినుండో ఆయన ఇలా చేస్తూ వస్తున్నారు. మహేష్ పోస్ట్‌తో ఇప్పుడీ ప్రేమలు సినిమాపై మరింతగా ప్రేక్షకుల దృష్టి పడుతుందనడంలో సందేహం లేదు.
Mahesh Babu Review on Premalu Movie:
Mahesh Babu Praises Premalu Movie