ByGanesh
Tue 23rd Jan 2024 11:13 AM
రీసెంట్ గా మహేష్ బాబు గుంటూరు కారం కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చలు జరిగాయి, డివైడ్ టాక్ తోనే భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన గుంటూరు కారం సందడి సర్దుమణగడంతో మహేష్ బాబు విదేశాలకి చెక్కేశారు. అయితే ఇదేమి పర్సనల్ ట్రిప్ కాదు.. మహేష్ బాబు రాజమౌళి తో చెయ్యబోయే SSMB29 ప్రి ప్రొడక్షన్ వర్క్ కోసమే జర్మనీ వెళ్లారంటూ, అది కాదు మహేష్ జర్మనీ వెళ్ళింది మేకోవర్ కోసమే అంటూ కొన్ని న్యూస్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అయితే మహేష్ జర్మనీ వెళ్లిన కారణం వేరే ఉందట. జర్మనీలో డాక్టర్ హ్యారీ కొనిగ్ అని ఓ పాపులర్ డాక్టర్ ఉన్నారట. ఆయన బ్రెన్నెర్స్ పార్క్ హోటల్ అండ్ స్పాలో ప్రత్యేక కన్సల్టేషన్లు చేస్తుంటారు. మహేష్ వెళ్ళింది ఆయన్ని కలుసుకోవడానికేనట. తన బాడీ ఫిట్ నెస్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల కోసం, శారీరక దృఢత్వానికి సంబంధించిన ముఖ్యమైన సలహాలు, సూచనలు ఆయన దగ్గర తీసుకుంటున్నారట. ఇది చిన్నపాటి ట్రిప్ అయినప్పటికీ మహేష్ హ్యారీ కొనిగ్ దగ్గర తీసుకున్న సలహాలు, సూచనలు హైదరాబాద్ కి వచ్చాక తన ఇంట్లోనే చేస్తారని చెబుతున్నారు.
మరి గుంటురు కారం కోసమా మూడు నెలల పాటు ఎలాంటి రెస్ట్ లేకుండా కష్టపడిన మహేష్ రాజమౌళితో చెయ్యబోయే SSMB29 కోసం మరింతగా కష్టపడాలి, అందుకే మహేష్ ఇలా శారీరకంగా, మానసికంగా సిద్దమవుతున్నాడని తెలుస్తోంది.
Mahesh foreign trip secret revealed:
Mahesh Reveals Reason Behind His Germany Visit