రెండు ఐపీఎల్ మ్యాచ్ లు..మొత్తం ఆరు వికెట్లు..ప్రతీ మ్యాచ్ లోనూ మూడు వికెట్ల ప్రదర్శన. మొదటి మ్యాచ్ లో 155.8కిలోమీటర్ల వేగంగా ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్. రెండో మ్యాచ్ లో 156.7కిలోమీటర్ల వేగంతో ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ ను తిరగరాయటం. మయాంక్ యాదవ్ అనే లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ సృష్టిస్తున్న సంచలనాలు ఇవి.