జాతర మార్గంలో క్యాంపులుఎప్పుడు ఎలాంటి సందర్భం ఎదురవుతుందో తెలియదు కాబట్టి ఆర్టీసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు మెకానిక్ బృందాలను ఏర్పాటే చేసిన అధికారులు జాతర మార్గంలో ఎక్కడికక్కడ మెయింటెనెన్స్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. హనుమకొండ, గుడెప్పాడు, గట్టమ్మ, పస్రా, తాడ్వాయి, జంగాలపల్లి, గణపురం, కాటారం, నార్లాపూర్, కామారం, కొండపర్తి, మేడారం ఇలా మొత్తం 12 చోట్లా టీమ్ లను అందుబాటులో ఉంచనున్నారు. ఒకవేళ బస్సు ట్రాఫిక్ లో చిక్కుకుని, కారు లాంటి ఫోర్ వీలర్ బండ్లు చేరుకోలేని ప్రదేశాల్లో ఇబ్బందులు తలెత్తితే.. అక్కడికి ద్విచక్రవాహనంపై వెళ్లి రిపేర్లు చేసి వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఆయా బృందాలకు సంబంధించిన సభ్యులకు ప్రత్యేకంగా పరిధి కేటాయించి, విధులు అప్పగిస్తున్నారు. ఇక వారి పరిధిలో బస్సుల్లో ఏదైనా లోపాలు తలెత్తితే సాధ్యమైనంతా తొందర్లో వారు అక్కడికి చేరుకుని మరమ్మతులు చేసి, బస్సును మళ్లీ రోడ్డెక్కించేందుకు కృషి చేస్తారు.
Source link
previous post