మైడారంలో జాయ్ రైడ్గత రెండు పర్యాయాలు కూడా హనుమకొండ నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ ప్రయాణాన్ని ఔత్సాహికులకు అందుబాటులోకి తెచ్చారు. కాగా ఒక్కో ట్రిప్ లో ఐదుగురికి ప్రయాణించే అవకాశం ఉండగా.. ఒక్కొక్కరికి హనుమకొండ నుంచి మేడారం జాతరకు రూ.20 వేల వరకు టికెట్ ధర నిర్ణయించారు. ప్రయాణికులు రూ.20 వేలు చెల్లిస్తే వారిని మేడారం తీసుకెళ్లడం, అక్కడ వారికి తల్లుల ప్రత్యేక దర్శనం చేయించి, తిరిగి మళ్లీ హనుమకొండకు చేర్చేవారు. ఈసారి రేట్ల విషయంలో పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉండగా.. గతంలో మాదిరిగానే టికెట్ ధర రూ.20 వేలకు పైగానే ఉండొచ్చని ఓ అధికారి తెలిపారు. అంతేగాకుండా హెలిక్యాప్టర్ మేడారం తీసుకెళ్లిన అనంతరం అక్కడ మేడారం ఏరియల్ వ్యూ చూసేందుకు కూడా అవకాశం ఇచ్చారు. గతేడాది మేడారం ఏరియల్ వ్యూ చూసిన వారిని టికెట్ ధర రూ.3700 నిర్ణయించగా.. ఈసారి ఏరియల్ వ్యూ రేట్లలో కొద్దిగా మార్పులు చేసినట్లు సమాచారం. ఈ సంవత్సరం ఏరియల్ వ్యూ కోసం ఒక్కో ప్రయాణికుడికి రూ.4,500 నుంచి రూ.4,800 వరకు టికెట్ రేటు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిని జాయ్ రైడ్ గా పిలుస్తుండగా.. దాదాపు 7 నుంచి 8 నిమిషాల పాటు హెలికాప్టర్ లో మేడారం చుట్టూ తిప్పి చూపిస్తారు. గత జాతర లో మేడారం జాయ్ రైడ్ కు చాలా మంది భక్తులు ఆసక్తి చూపగా.. ఈసారి కూడా సేవలు కొనసాగించేందుకు నిర్ణయించారు. ఇదిలాఉంటే హెలికాప్టర్ సేవలను కేవలం హనుమకొండ నుంచి మాత్రమే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల నుంచి ప్రారంభించనున్నట్లు తెలిసింది. కాగా ఆయా ప్రాంతాల నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు టికెట్ ధర నిర్ణయించే అవకాశం ఉంది.
Source link
previous post