GossipsLatest News

Mega family enjoying holiday in Italy మెగా ఫ్యామిలీ @ ఇటలీ వెకేషన్



Mon 30th Oct 2023 11:27 AM

mega family  మెగా ఫ్యామిలీ @ ఇటలీ వెకేషన్


Mega family enjoying holiday in Italy మెగా ఫ్యామిలీ @ ఇటలీ వెకేషన్

మెగా ఫ్యామిలిలో సభ్యులంతా ఒక్కొక్కరిగా వరుణ్ తేజ్ వివాహానికి ఇటలీకి బయలుదేరి వెళ్లిపోయారు. ఎవరి భార్యలని తీసుకుని వారు విడిగానే ఫ్లైట్ ఎక్కారు. మెగా-అల్లు ఫ్యామిలీ నవంబర్ 1 న జరగబోయే వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ బయలుదేరి వెళ్లారు. అందరికన్నా ముందే రామ్ చరణ్ తన భార్య ఉపాసన, పాప క్లింకార తో ఇటలీకి వెళ్ళిపోయాడు. శనివారం పవన్ కళ్యాణ్ తన భార్య అన్న లెజెనోవాతో ఇటలీ వెళ్లారు. అల్లు అర్జున్ కూడా శనివారమే స్నేహ, అర్హ, ఆయన్ తో కలిసి ఇటలీకి బయలు దేరాడు. 

అయితే వరుణ్ తేజ్ పెళ్ళికి కాస్త సమయం దొరకడంతో రామ్ చరణ్ తన భార్య పుట్టింటి వాళ్లతో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. అలాగే వరుణ్ తేజ్ కూడా అక్కడి స్పెషల్ ప్లేసెస్ లో ఫొటోస్ దిగి వాటిని షేర్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ అయితే తన భార్య స్నేహతో కలిసి ఇటలీలో రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తున్న పిక్స్ వదులుతున్నాడు. మరి వరుణ్ తేజ్ పెళ్లి పేరుతొ మెగా-అల్లు ఫామిలీస్ ఈ రెండు రోజులని ఇటలీలో వెకేషన్స్ పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈరోజు సోమవారం నుంచి ఇటలీలోని టుస్కనీ నగరంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల పెళ్లి వేడుకలు మొదలు కాబోతున్నాయి. కాక్ టైల్ పార్టీ, మెహిందీ, హల్దీ ఫంక్షన్ ఈరోజు రేపు జరగబోతున్నాయి. బుధవారం వరుణ్ తేజ్-లావణ్య ల వివాహానికి అని ఏర్పాట్లు జరిగిపోనున్నాయి.  


Mega family enjoying holiday in Italy:

Mega and Allu family enjoying holiday in Italy









Source link

Related posts

Telangana Assembly Elections 2023 Congress Senior Leader Rahul Gandhi Election Campaign In Jayashankar BhupalPalli | Rahul Election Campaign: తెలంగాణలో జరుగుతోంది కుటుంబ పాలన

Oknews

AR Constable, Who Pocketed 18.50 Lakhs In The Name Of Inspection, Dismissed From Service

Oknews

పూరి జగన్నాధ్ కొడుకు పేరు ఇక నుంచి  ఆకాష్ పూరి కాదు 

Oknews

Leave a Comment