Health Care

Memory Power : మెమోరీ పవర్‌ను పెంచే ఫ్రూట్ జ్యూస్.. ఈ పోషకాలే కారణం!


దిశ, ఫీచర్స్ : చదువులో, వర్కులో ఎందులో రాణించాలన్నా మెమోరీ పవర్ కీ రోల్ పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఏవైనా కారణాలవల్ల మెదడు సామర్థ్యం మందగించినా లేదా జ్ఞాపక శక్తి తగ్గినా రోజువారీ జీవితంలో సమస్యలకు దారితీస్తుంది. అయితే మనం తీసుకునే ఆహారాలు, ఫ్రూట్ జ్యూస్ వంటివి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా నివారిస్తాయని, జ్ఞాపక శక్తిని పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు. అవేమిటో చూద్దాం.

* బ్లూ బెర్రీ : మనకు అందుబాటులో ఉండే పండ్లల్లో బ్లూ బెర్రీస్ ఒకటి. వీటి జ్యూస్ తాగడంవల్ల మెదడుకు బలం లభిస్తుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. అందుకే వీటిని బ్రెయిన్ బెర్రీస్ అని కూడా పిలుస్తుంటారు. వీటిలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను, నరాలను ప్రేరేపిస్తాయి. మెమోరీ పవర్‌ను పెంచుతాయి.

* ఆరెంజ్ : ఇందులో న్యూరో ట్రాన్స్‌మిటర్ల ప్రొడ్యూసింగ్‌కు అవసరమైన విటమిన్ సి ఉంటుంది. ఇది బ్రెయిన్ ఫాగ్ ప్రాబ్లమ్స్ నివారించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. రెగ్యులర్‌గా తాగడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ అండ్ కాగ్నెటివ్ ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతాయని నిపుణులు చెప్తున్నారు.

*దానిమ్మ : అధిక మొత్తంలో ఫాలీ ఫెనాల్స్ కంటెంట్ కలిగి ఉండంటంవల్ల దానిమ్మ రసం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బ్రెయిన్ యాక్టివిటీని, మెమోరీ పవర్‌ను పెంచుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.

* బీట్ రూట్: ఇందులో బి విటమిన్‌తోపాటు నైట్రేట్లు అధికంగా ఉంటాయి. మెదడులో రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తూ నరాల ఉత్తేజాన్ని ప్రేరేపిస్తాయి. దీనివల్ల మెదడు కణాలకు పోషకాలు, ఆక్సిజన్ సమృద్ధిగా అందుతాయి. అందుకే బీట్‌రూట్ జ్యూస్ తాగుతూ ఉండాలని నిపుణులు సూచిస్తు్న్నారు. దీంతోపాటు ద్రాక్షరసం కూడా రెస్వెట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్నందువల్ల మెమోరీ పవర్‌ను పెంచుతుంది. న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల నివారణలో కీ రోల్ పోషిస్తుంది.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానులు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 



Source link

Related posts

ఫోన్ చూస్తూ, మాట్లాడుతూ ఇలా చేస్తున్నారా? జైలు శిక్షతో పాటు జరిమానా తప్పదంటున్న అధికారులు

Oknews

అమృతంతో సమానం అయిన ఈ పండుని తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Oknews

ల్యాప్‌టాప్ ఎక్కువగా వేడెక్కుతుందా… నిర్లక్ష్యం చేశారో భారీ నష్టం వాటిల్లుతుంది..

Oknews

Leave a Comment