దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది పాలను ఇష్టంగా తాగుతుంటారు. ఎందుకంటే వీటిలో పోషకాలు ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్, మన శరీరానికి అవసరమైన కొవ్వు కలిగి ఉంటుంది. రోజూ పాలను తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. అలాగే రోజంతా ఉత్సహంగా ఉంటారు. దీనిలో ఉండే విటమిన్ డి మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. అయితే, కొంతమందికి ఖాళీ కడుపుతో పాలు తాగవచ్చా అనే సందేహం వస్తుంటుంది. దాని గురించి నిపుణులు ఏం చెప్పారో ఇక్కడ చూద్దాం..
పరగడుపున పాలు తాగడం వల్ల జీర్ణక్రియ పని తీరు మెరుగుపడుతుంది. అలాగే ఎముకలు బలహీనంగా ఉన్నా అవి బలపడేలా చేస్తాయి. కాబట్టి ఉదయాన్నే పాలు తాగడం మంచిదే కానీ దీని వలన నష్టాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొందరికి లాక్టోస్ సమస్యలతో ఇబ్బంది పడతారు. దీనివల్ల కడుపునొప్పి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో పాలను తీసుకోకపోవడమే మంచిది. ఇలాంటి వారు టిఫిన్ చేసిన గంట తర్వాత తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.