సమ్మక్క పుట్టింది ఇక్కడేనంటూ..రాష్ట్రంలో చాలాచోట్లా మినీ మేడారం జాతరలు జరుగుతుండగా.. అందులో కొన్ని గ్రామాల్లో సమ్మక్క పుట్టింది ఇక్కడనేంటూ ప్రచారంలో ఉంది. ముఖ్యంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహడ్ గ్రామంలోనే సమ్మక్క పుట్టిందని అక్కడి పూర్వీకులు చెబుతుంటారు. దీంతో ఇక్కడ సమ్మక్క–సారలమ్మ గద్దెలు ఏర్పాటు చేసి ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నారు. ప్రతి జాతరకు కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు 30 లక్షల మంది వరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దీనిని మినీ మేడారంగా పిలుస్తుంటారు. ఇలాగే ఛత్తీస్ గడ్ లోనే సమ్మక్క పుట్టిందని అక్కడి ప్రజలు కూడా చాలాచోట్లా వనదేవతల జాతరలు నిర్వహిస్తుండటం విశేషం. ఇక సిద్దిపేట జిల్లాలోని అక్కెనపల్లి, పొట్లపల్లి, చిన్నకోడూరు, దేవక్కపల్లి తదితర గ్రామాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని రేకుర్తి, హుజురాబాద్ సమీపంలోని వీణవంక, శంకరపట్నం, రంగనాయకులగుట్ట, పెద్ద పల్లి జిల్లాలోని నీరుకుల్ల, గోదావరిఖని, మంచిర్యాల జిల్లా మందమర్రి, తంగెళ్లపల్లి మండలంలోని ఓబులాపురం తదితర చోట్ల కూడా మినీ మేడారం జాతరలు జరుగుతుంటాయి.
Source link
previous post