Komatireddy Venkat Reddy comments on Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యలు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ కు వెన్ను పోటు పొడిచేలా ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కావాలని హరీశ్ రావు ప్లాన్ లో ఉన్నట్లున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆయన కేసీఆర్ ను వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కవిత, హరీష్, కేటీఆర్ ల పేర్ల మీద విడిపోతుందని అన్నారు. బీఆర్ఎస్ లో నాలుగు పార్టీలు అవుతాయని జోస్యం చెప్పారు.
హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడని విమర్శించారు. ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని అన్నారు. కేసీఆర్ ను పులి అని ఆ పార్టీ నేతలు అంటుండడంపైన కూడా స్పందించారు. కేసీఆర్ నడవలేక చేతికర్ర పట్టుకొని తిరుగుతున్నారని.. అలాంటి ఆయన పులి ఎట్లా అవుతాడని అన్నారు. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే.. 86 కిలోలు ఉన్న నేనేం కావాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని చూడండి