GossipsLatest News

Mrunal Thakur Got Bumper Offer ప్రభాస్‌తో.. సీతకు బంపరాఫర్



Tue 12th Mar 2024 11:14 AM

mrunal thakur  ప్రభాస్‌తో.. సీతకు బంపరాఫర్


Mrunal Thakur Got Bumper Offer ప్రభాస్‌తో.. సీతకు బంపరాఫర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో జోడి కట్టాలంటే హీరోయిన్స్‌కి అదృష్టముండాలి. అందుకే ఆయనతో ఛాన్స్ కోసం చాలామంది హీరోయిన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడొక హీరోయిన్ లక్కీగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది అనే టాక్ మొదలైంది. సీతారామం చిత్రంతో సౌత్ లోకి సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చి సీతగా పాన్ ఇండియా ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించుకున్న బ్యూటీఫుల్ భామ మృణాల్ ఠాకూర్‌కి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దొరికింది అంటున్నారు.

ప్రభాస్‌తో హను రాఘవపూడి ఓ ప్రాజెక్ట్ చేసేందుకు కథని సిద్ధం చేసుకుంటున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ప్రభాస్-హను రాఘవపూడి మూవీ ఉండబోతుంది. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేకపోయినా.. హను రాఘవపూడి స్క్రిప్ట్ వర్క్ తో పాటుగా,. హీరోయిన్ సెలెక్షన్స్‌లో ఉన్నాడట. అందులో భాగంగానే మృణాల్ ఠాకూర్ అయితే ప్రభాస్ సరసన బావుంటుందని హను రాఘవపూడి అనుకుంటున్నాడ. ఈ జోడి కూడా ఫ్రెష్‌గా ఉంటుంది అని భావిస్తున్నట్లుగా సోషల్ మీడియా టాక్.

మరి ఇది నిజమే అయితే మృణాల్‌కి అదృష్టం పట్టినట్లే. ఇంకో 20 రోజుల్లో మృణాల్ నటించిన ఫ్యామిలీ స్టార్ విడుదల కాబోతుంది. అలాగే ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిం కల్కి మే 9న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల విడుదల తర్వాత.. హను రాఘవపూడి ప్రాజెక్ట్‌కు సంబంధించి అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.


Mrunal Thakur Got Bumper Offer:

Mrunal Thakur in Prabhas and Hanu Raghavapudi Project









Source link

Related posts

Tatikonda Rajaiah: అప్పటిదాకా నేనే సుప్రీం, ఎందుకు అలా వణికిపోతున్నారు – రాజయ్య మళ్లీ హాట్ కామెంట్స్

Oknews

Pooja Hegde buys new Range Rover Car పూజా హెగ్డే కాస్ట్లీ కారు ముచ్చట్లు

Oknews

dcm van collided famous singer mangli car | Singer Mangli: ప్రముఖ గాయని మంగ్లీ కారును ఢీకొన్న డీసీఎం

Oknews

Leave a Comment