GossipsLatest News

Naga Vamsi నాగవంశీ కోరిక నెరవేరినట్టే!



Sat 06th Apr 2024 01:07 PM

tillu square  నాగవంశీ కోరిక నెరవేరినట్టే!


Tillu Square will cross Rs 100 Cr: Naga Vamsi నాగవంశీ కోరిక నెరవేరినట్టే!

సిద్దు జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్ కాంబోలో మల్లిక్ రామ్ దర్శకుడిగా నాగవంశీ తెరకెక్కించిన టిల్లు స్క్వేర్ మూవీ విడుదలైన రోజే నాగవంశీ ఈ చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని నమ్మకాన్ని వ్యక్తం చేసాడు. మరి టిల్లు స్క్వేర్ విడుదలైన మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ రెస్పాన్స్ తో థియేటర్స్ లో కదం తొక్కుతుంది. ఒక కామెడీ చిత్రం మొదటిసారి 100 కోట్ల చేరువులోకి రావడం నిజంగా హర్షించ దగిన విషయమే.. అంటూ సోషల్ మీడియాలో అప్పుడే మాట్లాడుకోవడం ప్రారంభించారు. 

రోజు రోజుకి కలెక్షన్స్ పరంగా కొత్త మార్క్ చూపిస్తున్న టిల్లు స్క్వేర్ మొదటి మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ తో అన్ని ఏరియాల్లో కళకళలాడింది. మొదటి వారం పూర్తయ్యేసరికి టిల్లు స్క్వేర్ 96.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. అంటే 100 కోట్లకి చేరువలోకి టిల్లు స్క్వేర్ వచ్చేసింది. మరి ఈ లెక్కన నాగవంశీ నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టినట్లేగా.. 

ఏది ఏమైనా టిల్లు స్క్వేర్ ని చూసి మెగాస్టార్ అభినందించడం, జూనియర్ ఎన్టీఆర్ సిద్దు జొన్నలగడ్డ తో కలిసి టిల్లు స్క్వేర్ చూసి ఎంజాయ్ చెయ్యడం అన్ని ఈ చిత్రానికి అదనపు పబ్లిసిటీ దొరికేలా చేసింది. అందులోను ఈ వారం విడుదలైన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కి మిక్స్డ్ టాక్ రావడం టిల్లు స్క్వేర్ కి మరింత కలిసొచ్చే అంశమే. చూద్దాం 100 కోట్ల మార్క్ దాటి టిల్లు స్క్వేర్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో అనేది.! 


Tillu Square will cross Rs 100 Cr: Naga Vamsi:

Tillu Square: Siddu Jonnalagadda inching towards 100 crores mark









Source link

Related posts

Craze in Devara with NTR War 2 Shoot దేవరకి పెరుగుతున్న వెయిట్..

Oknews

TS DSC 2023: నిరుద్యోగులకు అలర్ట్, తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు

Oknews

వేరే లెవెల్ లో 'అఖండ-2'.. పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే!

Oknews

Leave a Comment