ByGanesh
Sun 24th Mar 2024 05:17 PM
కింగ్ నాగార్జున కొద్దిరోజులుగా మల్టీస్టారర్లు మీద మోజు చూపించేలా ఆయన ప్రాజెక్ట్స్ ఎంపిక కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం బాలీవుడ్ బ్రహ్మాస్త్ర చేసిన నాగార్జున ఆ తర్వాత నా సామీ రంగా అంటూ అల్లరి నరేష్-రాజ్ తరుణ్ లతో సినిమా చేసారు. ఇక ఇప్పుడు ధనుష్ కలయికలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే మల్టీస్టారర్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో నాగార్జున జాయిన్ అయ్యారు. కుబేర మూవీలో నాగార్జున పవర్ ఫుల్ ఈడీ అధికారి పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం సాగుతోంది.
ఆ తర్వాత నాగార్జున టాలీవుడ్ లో చెయ్యబోయే చిత్రంపై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. తమిళ దర్శకుడు నవీన్ అనే కొత్త కుర్రాడితో నాగార్జున తన తదుపరి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నాగార్జున సోలో హీరోగా కనిపిస్తారని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్నికూడా నాగార్జున మరో హీరోతో కలిసి చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. జ్ఞాన్ వేల్ రాజా నిర్మిస్తున్న సినిమా జులై నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.
అయితే ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటిస్తారని, నాగార్జున మరో స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని అంటున్నారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ జోనర్ చిత్రమని సమాచారం. దీంతో పేరున్న హీరోనే నాగార్జున చిత్రంలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Nagarjuna planning another multistarrer ?:
Exciting News about Nagarjuna Upcoming Project