ByGanesh
Wed 25th Oct 2023 01:40 PM
జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులు, బాలకృష్ణ అభిమానులు ఓ రేంజ్ లో ఎగిరిపడుతున్నారు. చంద్రబాబు నాయుడికి ఎన్టీఆర్ మద్దతు ఇవ్వలేదు, ఆయన జైల్లో ఉంటే ఎన్టీఆర్ స్పందించలేదు, బాలయ్య భగవంత్ కేసరి సినిమా విడుదలైతే బాబాయ్ కి శుభాకంక్షాలు తెలపలేదు, ఆల్ ద బెస్ట్ చెప్పలేదు అంటూ ఎన్టీఆర్ పై బాలయ్య ఫాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
అది ఎంతెలా అంటే.. ఓ థియేటర్ దగ్గర భగవంత్ కేసరి సినిమా ప్రదర్శన సందర్భంగా అక్కడ బాలకృష్జ ఫోటోతో ఉన్న ఎన్టీఆర్ బ్యానర్ ని కింద పడేసి తొక్కేంతగా. ఆ బ్యానర్ పై ఎన్టీఆర్ ఫోటోని చిత్రీకరించినందుకు గాను నందమూరి, బాలయ్య అభిమానులు అంతలా ఆ బ్యానర్ ని కిందపడేసి తొక్కుతున్న వీడియో చూసిన వారు తారక్ అంటే అంత కోపమెందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు.
కానీ తారక్ ఫాన్స్ మాత్రం బాలయ్య కావలసినప్పుడు ఎన్టీఆర్ స్పందించాలి.. లేదంటే ఎన్టీఆర్ ని పక్కనపడేస్తారు, నందమూరి కుటుంబం అస్సలు పట్టించుకోదు.. అలాంటప్పుడు ఎన్టీఆర్ ని అనేంత సీన్ మీకు లేదు అంటూ గట్టిగా కౌంటర్ వేస్తున్నారు.
Nandamuri fans angry on Jr NTR:
Nandamuri Fan Shocking Comments On Jr NTR