ByGanesh
Thu 21st Sep 2023 03:55 PM
బాలీవుడ్ ఎంట్రీ మూవీ తోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సౌత్ డైరెక్టర్ అట్లీపై నయనతారకి అంత కోపమెందుకువచ్చింది. ఇప్పుడదే కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తున్న న్యూస్. షారుఖ్ హీరోగా జవాన్ తో హిందీలో నయనతార అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో నయనతార ఒక్కసారిగా హిందీ ప్రేక్షకులకి రిజిస్టర్ అయ్యింది. జవాన్ మూవీలో నయనతార లుక్స్ కి, నయనతార యాక్టింగ్ కి మంచి పేరు వచ్చింది.
ఆ చిత్రం 1000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టే దిశగా పరుగులుపెడుతుంది. అంతటి విజయాన్ని సక్సెస్ ని ఎంజాయ్ చేయకుండా నయనతార ఆ చిత్ర దర్శకుడు అట్లీపై కోపమెందుకు తెచ్చుకుంది అంటే.. జవాన్ మూవీలో దీపికా పదుకొనె గెస్ట్ రోల్ చేసింది. ఆ రోల్ లో ఆమె కనిపించింది తక్కువసేపే అయినా దీపికా కేరెక్టర్ కి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. సోషల్ మీడియాలో ఆమెని తెగ పొగిడేశారు.
అదే నయనతార కి నచ్చలేదట. తనకన్నా దీపికా రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన అట్లీపై నయన్ ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు.. ఇకపై హిందీ పిక్చర్స్ లో నటించకూడదు అని డిసైడ్ కూడా అయ్యిందట. మరి ఇది నిజమా లేకుంటే ఎవరన్నా క్రియేట్ చేసి నయనతారని ఇరికిస్తున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉండగా.. నయనతార అట్లీపై కోప్పడింది అనేది సిల్లీ రూమర్ అంటూ కొంతమంది కొట్టేపారేస్తున్నారు.
Nayan unhappy with Jawan maker:
Nayanthara angry with Jawan director Atlee