Health Care

New Mothers : 40 ఏళ్లకు తల్లులు అవుతున్నరు.. మార్పు మంచిదేనా?


దిశ, ఫీచర్స్: ఈ జనరేషన్ అమ్మాయిల్లో చాలా మార్పు వచ్చింది. తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. పెళ్లికి బదులు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో లేట్ మ్యారేజెస్ ఎక్కువైపోయాయి. అంతకు ముందు 18 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకునే అమ్మాయిలు.. ఇప్పుడు 30 వచ్చాకే మ్యారేజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ముందు వెనుక ఆలోచించాకే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తల్లి అయ్యే వయసు కూడా 30, 40లలోనే ఉంటుంది. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇంతకీ ఓల్డర్ న్యూ మామ్స్ ట్రెండ్ మంచిదేనా? ఎలాంటి లాభాలున్నాయి? నష్టాలు ఏమైనా ఉన్నాయా? తెలుసుకుందాం.

మంచి(Good)

  1. ఓల్డర్ న్యూ మామ్.. అంటే 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో తల్లి కావడం. ఈ పద్ధతి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కలిగి ఉండేలా చేస్తుంది. ఈ ఏజ్ లో తమకు ఏం కావాలి? పుట్టిన బిడ్డకు ఏదైతే బాగుంటుంది? అనే క్లారిటీతో ఉంటారు.
  2. 30 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళ కెరీర్ ఖచ్చితంగా మెరుగైన స్థితిలో ఉంటుంది, అంటే పిల్లలను పెంచడానికి సురక్షితమైన వాతావరణం ఇవ్వగలదు. పిల్లవాడు కూడా తల్లిదండ్రుల ఇద్దరి పాలనలో పెరుగుతాడు.
  3. ఓల్డర్ న్యూ మామ్స్ తాము ఏం చేస్తున్నారో ముందే ఒక ప్లాన్ తో ముందుకు సాగుతారు. అన్నింటికీ సిద్ధమై ఉంటారు. పుట్టిన పిల్లల వల్ల కలిగే పాజిటివ్, నెగెటివ్ ఎఫెక్ట్స్ కు రెడీ అయిపోతారు.
  4. ఈ సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే నాలెడ్జ్ ఉంటుంది. ఎలాంటి గాబరా లేకుండా హెల్తీగా జీవించే ప్రయత్నం చేస్తారు. పిల్లల విషయంలో ఎప్పుడు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే మెచ్యూరిటీ కలిగి ఉంటారు.

చెడు(Bad)

  1. ఈ వయసులో పిల్లలను కనాలనే ఆలోచన మంచిదే. కానీ 30, 40లలో సహజంగా గర్భం దాల్చడం కష్టం. 20లలో మాదిరిగా కాకుండా వయసు పెరుగుతున్న కొద్దీ ఫెర్టిలిటీ ఇష్యూస్ పెరుగుతుంటాయి. పైగా ఇప్పుడున్న కాలుష్య ప్రపంచంలో మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. అమ్మాయిలలో PCOS, PCOD లాంటి గర్భాశయ సమస్యలు తలెత్తితే… అబ్బాయిలలో స్పెర్మ్ కౌంట్, నాణ్యత తగ్గుతుంది.
  2. ఆర్టిఫీషియల్ పద్ధతుల ద్వారా బిడ్డను పొందినా.. డెలివరీ తర్వాత తలెత్తే వెన్ను, గర్భాశయ సమస్యలు డీల్ చేయడం కష్టంగా ఉంటుంది. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ వెంటాడే ఛాన్స్ ఉంటుంది.
  3. ముఖ్యంగా భారతదేశంలో లేట్ గా పిల్లలను కనాలని తీసుకునే నిర్ణయంతో
  4. సమాజంలో కళంకం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

మొత్తానికి మాతృత్వంపై సమాజపు అభిప్రాయాలు నెమ్మదిగా మారుతున్నాయి. సెటిల్ అయ్యాకే పిలలకు జన్మనివ్వాలనే స్త్రీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎదుటివ్యక్తి జడ్జ్ మెంట్ తో సంబంధం లేకుండా తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటున్న మహిళలు.. సామాజికంగా ఎదురయ్యే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటున్నారు. భర్తతో సమానంగా బాధ్యతలు తీసుకుంటూ సత్తా చాటుతున్నారు.



Source link

Related posts

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? బంగాళదుంపతో శాస్వత పరిష్కారం.. ఎలాగంటే?

Oknews

డయేరియాతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేసి ఆ సమస్యకు చెక్ పెట్టండి

Oknews

ఫ్లైట్‌లో రొమాన్స్‌తో రెచ్చిపోయిన జంట.. చేతులతో వికృత చేష్టలు చేస్తూ.. (పోస్ట్ వైరల్)

Oknews

Leave a Comment