Sports

New Zealand Vs South Africa Live Streaming World Cup 2023 When And Where To Watch NZ Vs SA Match Free | New Zealand Vs South Africa : సమఉజ్జీల మహా సంగ్రామం, దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ ఢీ


World Cup 2023 New Zealand vs South Africa:

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సమఉజ్జీల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. వరల్డ్‌కప్‌ ఆరంభంలో వరుస విజయాలు సాధించి తర్వాత రెండు ఓటములు చవిచూసిన న్యూజిలాండ్‌… పాకిస్థాన్‌పై చివరి వికెట్‌కు అద్భుత విజయం సాధించిన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ చివరివరకు పోరాడగా… పాకిస్థాన్‌పైనా ప్రొటీస్‌ చివరి వికెట్‌ వరకు పోరాడింది. ఈ పోరాటంలో కివీస్‌ను ఓటమి పలకరించగా… సఫారీ జట్టు విజయం సాధించింది. కానీ ఓడిపోయినా న్యూజిలాండ్‌ పోరాటం అందరినీ ఆకట్టుకుంది. సెమీఫైనల్ బెర్త్‌ల కోసం రెండు జట్లూ గట్టి పోటీలో ఉన్నందున ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకం కానుంది. దక్షిణాఫ్రికా ఆరు మ్యాచుల్లో అయిదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ ఆరు మ్యాచుల్లో 4 విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ సెమీస్‌ బెర్తులను ప్రభావితం చేయనుండడంతో ఇరు జట్లు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి.

 

మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గత మ్యాచ్‌లో శ్రీలంకపై అఫ్గాన్‌ ఘన విజయం సాధించింది. ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా జట్టులో క్వింటన్ డి కాక్ 431 పరుగులతో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు మూడు సెంచరీలతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రొటీస్‌కు డికాక్‌ ఉంటే న్యూజిలాండ్‌కు రచిన్ రవీంద్ర  ఉన్నాడు. న్యూజిలాండ్ తదుపరి బ్యాటింగ్ సంచలనంగా అభివర్ణిస్తున్న రచిన్‌ ఈ ప్రపంచకప్‌లో 406 పరుగులతో మెరుగ్గా రాణిస్తున్నాడు. సౌతాఫ్రికా తరఫున క్లాసెన్ 300 పరుగులతో ఫినిషర్‌ పాత్ర పోషిస్తుండగా… న్యూజిలాండ్‌లో ఆ పనిని జిమ్మీ నీషమ్‌ నిర్వర్తిస్తున్నాడు. డేవిడ్ మిల్లర్, డారిల్ మిచెల్, ఐడెన్ మార్క్రామ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆటగాళ్లతో ఇరు జట్లు బ్యాటింగ్‌లో బలోపేతంగా ఉన్నాయి.

 

ఈ మ్యాచ్‌కుస్టార్‌ ఆటగాడు, రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది. అక్టోబర్‌ 13న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్‌ బొటవేలికి గాయమైంది. దీంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న విలియమ్సన్‌ ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. న్యూజిలాండ్‌ సౌతాఫ్రికా మ్యాచ్‌లో కేన్‌ అందుబాటులోకి వస్తే కివీస్‌ బ్యాటింగ్ లైనప్‌ బలోపేతం కానుంది. కేన్‌ తిరిగి జట్టులోకి వచ్చే విషయమై న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. విలియమ్సన్‌ పూర్తిగా కోలుకుని జట్టులో చేరితే విల్‌ యంగ్‌పై వేటు పడే అవకాశం ఉంది. 

బౌలింగ్‌లోనూ కివీస్‌-సఫారీ జట్లు దుర్భేద్యంగా ఉన్నాయి. కగిసో రబడా తిరిగి జట్టులోకి రానున్నాడు. గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సెన్‌లతో దక్షిణాఫ్రికా బౌలింగ్ యూనిట్‌ బలంగా ఉంది. కేశవ్ మహారాజ్, తబ్రైజ్ షంసీ స్పిన్‌తో పర్వాలేదనిపిస్తున్నారు. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో షంసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకుని సత్తా చాటాడు. న్యూజిలాండ్‌లో మిచెల్‌ శాంట్నర్‌ స్పిన్‌తో ప్రొటీస్‌ బ్యాటర్లకు పరీక్ష పెట్టగలడు. 

 

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్‌), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిల్  ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్‌క్రమ్‌, డేవిడ్ మిల్లర్, ఎంగిడి, కగిసో రబడ, తబ్రైజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాద్ విలియమ్స్. 

 

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ , విల్ యంగ్.



Source link

Related posts

R Ashwin Credits Familys Sacrifices Ahead Of 100th Test

Oknews

Kelvin Kiptum Kenyas Marathon world record holder dies in road accident at 24

Oknews

England bowler Stuart Broad comments on social media about kohli and post delete

Oknews

Leave a Comment