ByGanesh
Sat 29th Jun 2024 10:33 AM
నార్త్ ఆడియన్స్ కి ప్రభాస్ పై అంత ప్రేమెందుకు. ప్రభాస్ సినిమాలంటే అంత క్రేజేందుకు. బాహుబలి తర్వాత ప్రభాస్ ని ఎందుకంతగా ఆరాధిస్తున్నారు. సౌత్ లో ఆడని సినిమాల్ని కూడా నార్త్ లో హిట్ చేస్తున్నారు. కేవలం అదంతా ప్రభాస్ మ్యానియానేనా.. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ పై పెరిగిన అంచనాలేనా..
బాహుబలి తర్వాత వచ్చిన సాహో ని నెత్తిన పెట్టుకున్నారు. ఆ సినిమా సౌత్ లో ఏమాత్రం ఆడలేదు. కానీ నార్త్ ఆడియన్స్ ఆదరించారు. సరే బాహుబలి క్రేజ్ అనుకున్నారు. తర్వాత వచ్చిన రాధేశ్యామ్ , ఆదిపురుష్ చిత్రాలు సరేసరి.. సలార్ ని అక్కడ హిందీ ప్రేక్షకులు హిట్ చేసారు. ఇప్పుడు కల్కి నైట్ బాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. అక్కడి క్రిటిక్స్, వెబ్ సైట్స్ కూడా ఎత్తేస్తున్నాయి. నెత్తిన పెట్టుకున్నాయి.
సౌత్ లో కల్కి 2898 AD కి సూపర్ హిట్ రివ్యూస్ అంటే కేవలం 3 రేటింగ్స్ తో రివ్యూస్ ఇచ్చారు క్రిటిక్స్. ప్రభాస్ తెలుగు హీరో, నాగ్ అశ్విన్ తెలుగు దర్శకుడు అయినా క్రిటిక్స్ ఓవరాల్ గా కల్కి కి 3 రేటింగ్ ఇచ్చారు. కానీ నార్త్ వెబ్ సైట్స్, అక్కడి బెస్ట్ క్రిటిక్స్ దగ్గర నుంచి సినిమా విమర్శకుల వరకు కల్కి కి 4 పైనే రేటింగ్స్ ఇవ్వడం నిజంగా షాకిచ్చింది.
నార్త్ లో కల్కి కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రావడం మరింత ఆశ్చర్యపరుస్తుంది. ప్రభాస్ కి నార్త్ లో ఇంత క్రేజ్ ఎలా అని చాలామంది అనుకుంటున్నారు. బాహుబలి తో నార్త్ ఆడియన్స్ మదిలో ప్రభాస్ నిలిచిపోయాడు కాబట్టే ఈ క్రేజ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగా నార్త్ ఆడియన్స్ మరోసారి ప్రభాస్ విషయంలో పవర్ చూపించారు.
North audience again showing power:
The expected number for Kalki 2898 AD