దిశ, ఫీచర్స్ : ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా. ఈ నిరుద్యోగుల కోసం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ శుభవార్త తెలిపింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 223 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ careers.ntpc.co.inని సందర్శించవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ 25 జనవరి 2024 న ప్రారంభమై 8 ఫిబ్రవరి 2024న ముగియనుంది. అంటే అభ్యర్థులు కేవలం 14 రోజులు మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నారు.
NTPC రిక్రూట్‌మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి ?
దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ – careers.ntpc.co.inకి వెళ్లండి.
వెబ్‌సైట్ హోమ్ పేజీలో తాజా రిక్రూట్‌మెంట్ లింక్ పై క్లిక్ చేయండి.
దీని తర్వాత మీరు NTPC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2024 లింక్‌కి లాగిన్ అవ్వండి.
తదుపరి పేజీలో అడిగిన వివరాలను నమోదు చేసుకోండి.
రిజిస్ట్రేషన్ తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు.
రిజిస్ట్రేషన్ తర్వాత, ప్రింట్ తీసుకోండి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్, OBC కేటగిరీకి చెందిన వారు ఫీజుగా రూ. 300 డిపాజిట్ చేయాలి. ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజులను ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు.
అర్హత, జీతం
NTPC జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఖాళీకి దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఇది కాకుండా, 3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. ఈ ఖాళీ కింద, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 55000 జీతం లభిస్తుంది. అలాగే ఇతర ప్రభుత్వ అలవెన్సులు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి.