ByGanesh
Thu 11th Apr 2024 01:43 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముంబై వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళతో పోలిస్తే.. తారక్ అంతగా ముంబై వెళ్ళడు, ఆర్.ఆర్.ఆర్ సమయంలో ప్రమోషన్స్ కోసం తరచూ ముంబై వెళ్లిన ఎన్టీఆర్ మళ్ళీ ఆ తర్వాత చాలా రేర్ గా అక్కడ కనిపించాడు. కానీ ఇప్పుడు తరచూ ముంబై ఫ్లైట్ ఎక్కేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలో గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాడు.
ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో, యష్ రాజ్ ఫిలిమ్స్ లాంటి బడా సంస్థలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రం చెయ్యడానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం గత నెలలోనే పట్టాలెక్కింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్ గా కనిపిస్తాడని ప్రచారముంది. అయితే వార్ 2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ రేపు శుక్రవారం ముంబై వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.
రేపటి నుంచి ఓ పది రోజుల పాటు ఎన్టీఆర్ ముంబైలో మకాం వెయ్యనున్నాడట. అక్కడ స్టార్ హోటల్ లో ఎన్టీఆర్ బస చేస్తాడని, ముంబై పరిసర ప్రాంతాల్లో జరగబోయే వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ముందుగా ఆయన్ ముఖర్జీ హృతిక్-ఎన్టీఆర్ కలయికలో యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ కి బ్రేకిచ్చి ముంబై వెళ్ళాడు. వార్ 2 షూటింగ్ లో పది రోజులు స్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి దేవర సెట్స్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.
NTR will stay in Mumbai for 10 days:
Hrithik Roshan, Jr NTR to kick start schedule in War 2