Hyderabad News: ఉస్మానియా యూనివర్శిటీలోని మహిళా హాస్టల్‌లోకి ఆగంతకులు ప్రవేశించినట్టు విద్యార్థినులు చెబుతున్నారు. తమకు రక్షణలేదని ఆందోళనకు దిగారు. దీంతో ఓయూ లేడీస్‌ హాస్టల్ పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఓయూ లేడీస్ హాస్టల్లో ఆగంతకులు చొరబడటంపై తమకు రక్షణ లేదంటూ భారీగా విద్యార్థినులు రోడ్డుపైకి వచ్చారు. సీసీటీవీలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు అగంతకుడిని తీసుకెళ్లొద్దంటూ పట్టుపట్టారు. పోలీసుల ముందు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

అర్ధరాత్రి ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లోకి రాత్రి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు. అమ్మాయిలు అప్రమత్తం కావడంతో వాళ్లు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి విద్యార్థినులకు దొరికిపోయారు. అతన్ని పట్టుకొని చున్నీతో కట్టేశారు. వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు వాళ్లు రావడంతో వారికి అప్పగించారు.

ఈ ఘటనతో ఒక్కసారిగా విద్యార్థినుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హాస్టల్లో రక్షణ కరవైందని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని రాత్రి విద్యార్థినులు నిరసనకు దిగారు. వెంటనే కలుగు చేసుకున్న ప్రిన్సిపల్‌ స్టూడెంట్స్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Source link