Latest NewsTelangana

Padma Awards 2024 Padma Vibhushan Bhushan Padma Shri List Awardees From Telugu States Chiranjewvi Venkaiah | Padma Awards 2024: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం


Padma Awards 2024 from Telugu States: 2024 ఏడాదికి గానూ పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరిచింది.

ప్రసిద్ధ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. సినీ, సామాజిక రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది. 2007లో ఆయనకు పద్మభూషణ్ అవార్డ్ దక్కింది.

పద్మవిభూషణ్ 2024 విజేతలు

  • కొణిదెల చిరంజీవి (కళ) – ఆంధ్రప్రదేశ్
  • ఎం. వెంకయ్య నాయుడు (ప్రజా వ్యవహారాలు) – ఆంధ్రప్రదేశ్
  • బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ) – బిహార్
  • పద్మా సుబ్రహ్మణ్యం (కళ) – తమిళనాడు
  • వైజయంతిమాల బాలి (కళ) – తమిళనాడు

వీరికి పద్మశ్రీ అవార్డులు

మొత్తం 34 మందికి దేశ వ్యాప్తంగా పద్మశ్రీ అవార్డులను ఇచ్చారు. వీరిలో తెలంగాణ నుంచి యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రకథ వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీలు దక్కాయి. దాసరి కొండప్ప నారాయణపేట జిల్లా దామరగిరి వాసి. 

ఏపీ నుంచి హరికథ కళాకారిణి డి. ఉమామహేశ్వరికి పద్మశ్రీ వచ్చింది. ఈమె ప్రపంచవ్యాప్తంగా వివిధ స్టేజీలపై ప్రదర్శనలు ఇచ్చిన హరికథ కళాకారిణిగా ఉమా మహేశ్వరికి పేరుంది. ఈమె క్రిష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి..

  • గడ్డం సమ్మయ్య – తెలంగాణ
  • దాసరి కొండప్ప – తెలంగాణ
  • డి. ఉమామహేశ్వరి – ఆంధ్రప్రదేశ్‌

ఇతర రాష్ట్రాల వారు

  • భద్రప్పన్‌ ఎం – తమిళనాడు
  • జోర్డాన్‌ లేప్చా – సిక్కిం
  • మచిహన్‌ సాసా – మణిపూర్‌
  • నారాయణన్‌ ఈపీ – కేరళ
  • భాగబత్‌ పదాన్‌ – ఒడిశా
  • శాంతిదేవీ పాశ్వాన్, శివన్‌ పాశ్వాన్‌ – బిహార్‌
  • ఓంప్రకాశ్‌ శర్మ – మధ్యప్రదేశ్‌
  • రతన్‌ కహార్‌ – పశ్చిమ బెంగాల్‌
  • సనాతన్‌ రుద్ర పాల్‌ – పశ్చిమ బెంగాల్‌
  • నేపాల్‌ చంద్ర సూత్రధార్‌ – పశ్చిమ బెంగాల్‌
  • గోపీనాథ్‌ స్వైన్‌ – ఒడిశా
  • అశోక్‌ కుమార్‌ బిశ్వాస్‌ – బిహార్‌
  • స్మృతి రేఖ ఛక్మా – త్రిపుర
  • జానకీలాల్‌ – రాజస్థాన్‌
  • బాలకృష్ణన్‌ సాధనమ్‌ పుథియ వీతిల్‌ – కేరళ
  • బాబూ రామ్‌యాదవ్‌ – ఉత్తర్‌ప్రదేశ్‌

సామాజిక సేవ

  • దుఖు మాఝీ – పశ్చిమ బెంగాల్‌
  • సంగ్థాన్‌కిమా – మిజోరం
  • ఛామి ముర్మూ – ఝార్ఖండ్‌
  • గుర్విందర్‌ సింగ్‌ – హరియాణా
  • జగేశ్వర్‌ యాదవ్‌ – ఛత్తీస్‌గఢ్‌
  • సోమన్న – కర్ణాటక
  • పార్బతి బారువా – అస్సాం

క్రీడారంగం

  • ఉదయ్‌ విశ్వనాథ్‌ దేశ్‌పాండే – మహారాష్ట్ర

వైద్యరంగం

  • హేమచంద్‌ మాంఝీ – ఛత్తీస్‌గఢ్‌
  • ప్రేమ ధన్‌రాజ్‌ – కర్ణాటక
  • యజ్దీ మాణెక్‌ షా ఇటాలియా – గుజరాత్‌

ఇతర విభాగాలు

  • సత్యనారాయణ బెలేరి – కేరళ
  • కె.చెల్లామ్మళ్‌ – అండమాన్‌ నికోబార్‌
  • సర్బేశ్వర్‌ బాసుమతరి – అసోం
  • యనుంగ్‌ జామోహ్‌ లెగో – అరుణాచల్‌ ప్రదేశ్‌



Source link

Related posts

ఎయిర్‌టెల్ బేస్ బాండ్ యూనిట్ల చోరీ..అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్-theft of airtel base band units inter state gang of thieves arrested ,తెలంగాణ న్యూస్

Oknews

కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ, రెండ్రోజుల్లో రైతు బంధు జమ-టీఎస్ కేబినెట్ కీలక నిర్ణయాలివే!-hyderabad news in telugu ts cabinet key decisions new white ration cards rythu bandhu amount ,తెలంగాణ న్యూస్

Oknews

Fake RPF SI Malavika Arrested | Fake RPF SI Malavika Arrested | పెళ్లి చూపుల్లో అడ్డంగా బుక్కైన నకిలీ మహిళ ఎస్సై

Oknews

Leave a Comment