GossipsLatest News

Pawan fans saluting Harish Shankar హరీష్ కి సెల్యూట్ కొడుతున్న పవన్ ఫాన్స్



Tue 19th Mar 2024 10:12 PM

ustaad bhagat singh  హరీష్ కి సెల్యూట్ కొడుతున్న పవన్ ఫాన్స్


Pawan fans saluting Harish Shankar హరీష్ కి సెల్యూట్ కొడుతున్న పవన్ ఫాన్స్

పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ అంటే పవన్ ఫాన్స్ కి ప్రత్యేకమైన అభిమానం. కానీ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో తేరి రీమేక్ చేస్తున్నాడు అనగానే ఫైట్ స్టార్ట్ చేసారు. ఉస్తాద్ భగత్ సింగ్, తమిళనాట విజయ్ నటించిన తేరికి రీమేక్, అది తెలుగులో పోలీసుడిగా విడుదలయ్యింది. అలాంటి సినిమాని పవన్ తో రీమేక్ చెయ్యడం కరెక్ట్ కాదంటూ హరీష్ శంకర్ ని ట్రోల్ చెయ్యడమే కాదు దుమ్మెత్తిపోశారు. హరీష్ శంకర్ నానా తిట్లు తిట్టారు. హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ ఫాన్స్ అని చెప్పుకుంటూ తనని తిట్టిన వారికి అదిరిపోయే కౌంటర్ వేసేవాడు. 

మరి అంతలా తిట్టిన హరీష్ కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫాన్స్ సెల్యూట్ చేస్తున్నారు. కాదు కాదు పొగుడుతూ ఆకాశానికెత్తేస్తున్నారు. కారణం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని ఉస్తాద్ గా చూపించిన తీరుకి, ఉస్తాద్ భగత్ సింగ్ గా పవర్ ఫుల్ పవన్ కళ్యాణ్ ని చూపించినందుకు, మాస్ ఆడియన్స్ విజిల్స్ వేసేలా ఉస్తాద్ భగత్ సింగ్ ని తెరకెక్కస్తున్నందుకు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వదిలిన పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్ టీజర్ కి సోషల్ మీడియా నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి పవన్ కళ్యాణ్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కి ఇచ్చినవి చాలా తక్కువ డేట్స్. అసలు మొత్తం మీద ఉస్తాద్ కి సంబంధించి ఓ షెడ్యూల్ మాత్రమే పూర్తయ్యింది. కానీ ఇచ్చిన కొన్ని డేట్స్ కే హరీష్ శంకర్ ఇంత తీశారంటే 🤔 ఇంకో నెల రోజులు ఇస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొత్తం కంప్లీట్ చేసేసేవాడేమో… అంటూ హరీష్ ని తెగ పొగిడేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఫాన్స్ లో ఉన్న నెగిటివిటి ఈ గ్లిమ్ప్స్ తో ఎగిరిపోవడం మాత్రం పక్కా.


Pawan fans saluting Harish Shankar:

Ustaad Bhagat Singh- Massy Bhagats Blaze is out now









Source link

Related posts

mahatma gandhi university nalgonda has released TS EDCET-2024 Notification check application dates and exam details here | TS EDCET Notification: టీఎస్ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల

Oknews

సినీ నటి అంజలి బహిష్కరణ.. కుర్చీ తగలపడిపోయింది

Oknews

Minister Ponnam Prabhakar said vehicles in Telangana will be registered under TG name from March 15 | Ponnam Prabhakar: రేపటి నుంచి వాహన రిజిస్ట్రేషన్లు అన్ని TG గానే

Oknews

Leave a Comment