ByGanesh
Sun 30th Jun 2024 10:42 AM
పదేళ్లుగా ఏపీ రాజకీయాల్లో మెల్లగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడమే కాదు.. ఈ ఎన్నికల్లో 21 సీట్లతో జనసేనని ఏపీ ప్రభుత్వంలో కీలంగా మర్చి ఏపీ ముఖ్యమంత్రి తర్వాత స్థానాన్ని కైవసం చేసుకుని కార్యసాధకుడిగా మారిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్… సహనానికి, ఓపికకి అందరూ ఫిదా అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి చవి చూసినా, ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ తో కలిసి తను నిలబెట్టిన అభ్యర్థులందరిని గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ ప్రజల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు,
2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అంత్యంత కీలకముగా మారేందుకు ఇప్పటినుంచే బాటలు వేసుకుంటున్నారు అనిపించేలా ఆయన శాఖల పని తీరు కనిపిస్తుంది. ఆయా శాఖలపై పట్టు సాధిస్తున్నారు, అధికారులతో పరుగులు పెట్టిస్తున్నారు, సమీక్షలు, సమావేశాలంటూ పవన్ జోరు చూపిస్తున్నారు. ఇదంతా ఈ ఐదేళ్లు కంటిన్యూ అయితే పవన్ కళ్యాణ్ ప్రభావం 2029 ఎన్నికల్లో ఎలా ఉంటుందో ఊహించేసుకోవచ్చు.
మరోపక్క పవన్ కళ్యాణ్ తన జనసేనాని తెలంగాణాలో కూడా పటిష్ఠం చేసేలా చర్యలు మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లిన ఆయన తెలంగాణలోనూ బీజేపీ తో కలిసి పని చేస్తామని ప్రకటించేసారు. ఇప్పటికే తెలంగాణాలో BRS కి ఉన్న బలం బిజెపి వైపు టర్న్ అయ్యింది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఎంపీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ సత్తా చాటింది.
మరి జనసేన బీజేపీ తో కలిసి తెలంగాణాలోను పోటీ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన ప్రాభవం పెరగండం గ్యారెంటీ అంటున్నారు. మరి నిజంగానే పవన్ ఇలాంటి ప్లాన్ చేస్తే సూపర్ అంటున్నారు. కొందరు పవన్ ప్లానింగ్ మాములుగా లేదు 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పవన్ అడుగులు వెయ్యడం శుభపరిణామం అంటున్నారు.
Pawan planning is not normal!!:
Pawan Kalyan Fans Request Him To Contest In Telangana Politics