Sports

PBKS Vs DC IPL 2024 Ishant Sharma Injured Delhi Capitals Pacer Leaves Ground Midway | PBKS Vs DC, IPL 2024: ఢిల్లీకి బ్యాడ్ న్యూస్


Ishant Sharma Injured  Delhi Capitals Pacer Leaves Ground Midway: పంజాబ్‌(PBKS) తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ( Delhi Capitals)కి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పేసర్‌ ఇషాంత్ శర్మ(Ishant Sharma) ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. మిచెల్ మార్ష్‌ వేసిన ఆరో ఓవర్‌లో మూడో బంతిన ఆపబోయి కాలుజారి ఇషాంత్‌ కిందపడ్డాడు. గాయంతో బాధపడుతూ ఇషాంత్‌ శర్మ మైదానాన్ని వీడాడు. రెండు ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీసిన ఇషాంత్‌ శర్మ గాయపడడం ఢిల్లీని ఆందోళన పరుస్తోంది. ఇషాంత్‌ ఇంకో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేయాల్సి ఉంది. ఇషాంత్‌ మళ్లీ బౌలింగ్‌కు రాకపోతే ఢిల్లీ బౌలింగ్ దళానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. 

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. ఆరంభంలో ధాటిగా ఆడిన పంజాబ్‌ మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ చివర్లో అభిషేక్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో భారీ స్కోరు చేసింది. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ 4 ఫోర్లు 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి సత్తా చాటాడు. అభిషేక్‌ ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. హోప్‌ 33, వార్నర్‌ 29, మార్ష్‌ 20 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పంత్‌… 18 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2, హర్షల్‌ పటేల్‌ 2, రబాడ,బ్రార్‌, చాహల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. తర్వాత  175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌.. పవర్‌ ప్లే ముగిసేసరికి 60 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. 

పంత్‌  మంచి టచ్‌లో కనిపించినా…
వార్నర్‌ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్‌ రిషభ్‌ పంత్‌ తొలి మ్యాచ్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఆరంభంలో క్రీజులోకి స్వేచ్ఛగా కదులిన పంత్‌ ఓ ఫోర్‌ కొట్టి మంచి టచ్‌లో కనిపించాడు. ఆడిన తొలి మూడు బంతుల్లో రెండు సింగిల్స్‌ తీసి భారీ స్కోరు చేస్తాడని ఆశలు రేపాడు. రాహుల్ చాహర్‌ వేసిన 12 ఓవర్‌లో రెండో బంతిని బౌండరీకి పంపి ఈ ఐపీఎల్‌లో రిషభ్ పంత్‌ మొదటి బౌండరీ సాధించాడు. ఆ తర్వాత మరో బౌండరీ బాది ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. మొత్తం 13 బంతులు ఎదుర్కొన్న పంత్‌ 2 ఫోర్లతో 18 పరుగులు చేసి అవుటయ్యాడు. హర్షల్‌  పటేల్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టోకు సులువైన క్యాచ్‌ ఇచ్చి పంత్‌ అవుటయ్యాడు.

వరుసగా వికెట్ల పతనం
పంత్‌ తర్వాత ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. రిషభ్‌ పంత్ (18‌)  రికీ భుయ్‌ (3) స్టబ్స్‌ (5) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. 21 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్న అక్షర్‌ పటేల్ రనౌట్‌ కావడంతో ఢిల్లీ కష్టాలు పెరిగాయి. హర్షల్‌ పటేల్ వేసిన 18 ఓవర్‌లో తొలి బంతికి రెండో పరుగు కోసం యత్నించి అక్షర్‌ రనౌటయ్యాడు. చివర్లో అభిషేక్‌ పటేల్‌ చెలరేగడంతో ఢిల్లీ 165 పరుగులు చేయగలిగింది. ఎనిమిది బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ 2 ఫోర్లు  ఒక సిక్సుతో 20 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2, హర్షల్‌ పటేల్‌ 2, రబాడ,బ్రార్‌, చాహల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

Stop clock set to become a permanent fixture in white ball internationals from T20 World Cup 2024

Oknews

PAK Vs BAN: తక్కువ స్కోరుకే బంగ్లా కట్టడి, పాక్‌ బ్యాటర్లు ఏం చేస్తారో?

Oknews

Pant can play T20 World Cup if he can keep wicket BCCI secretary Jay Shah

Oknews

Leave a Comment