Health Care

Personality test : మీరు మీ మొబైల్‌ని ఇలా వాడుతున్నారా.. అయితే మీ క్యారెక్టర్ ఇదే!


దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ చూస్ చేస్తుంటారు. అయితే మనం కొంత మందిని చూస్తుంటే, ఒకొక్కరూ ఒక్కో విధంగా మొబైల్ ఫోన్ పట్టుకొని కనిపిస్తారు. అయితే దీనికి సంబంధించే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అది ఏమిటి అనుకుంటున్నారా? మనం మొబైల్ ఫోన్ పట్టుకునే విధానం బట్టీ కూడా మన క్యారెక్టర్ డిసైడ్ చేయవచ్చునంట. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫోన్ రెండు చేతులతో పట్టుకొని, రెండు బొటన వేళ్లతో ఫోన్ యూస్ చేస్తే అలాంటి వారు ఎప్పుడూ ఫుల్ ఎనర్జీగా ఉంటూ, తమ సమస్యలకు వెంటనే పరిష్కారం కనుగొంటరంట. వీరిలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుందంట. అలాగే పార్టీలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందంట.

మొబైల్‌ను రెండు చేతులతో పట్టుకొని ఒక బొటన వేళుతో ఫోన్ ఆపరేటింగ్ చేస్తే, అలాంటి వ్యక్తులు సానుభూతిపరులంట. వారు ప్రతి చిన్న విషయాన్ని లోతుగా పరిశీలించడమే కాకుండా, ఇతరులకు ఎక్కువగా సహాయం చేసే గుణం కలిగి ఉంటారంట. అలాగే ఈ రకమైన వ్యక్తులు సెకండ్ ఛాన్స్ కోసం ఎప్పుడూ చూడరంట.

ఒక చేతితోనే ఫోన్ పట్టుకొని అదే చేయి బొటన వేళుతో ఫోన్ వాడే వ్యక్తులు ఆశావాదులు, అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా కలిగి ఉంటారంట. రిస్క్ తీసుకోవడం వీరికి చాలా ఇష్టం. అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంటారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇతరులను కూడా వాడుకుంటారంట. ఏ విషయం అయినా సరే లోతుగా విశ్లేషించకుండా, దూసుకుపోయే ధోరణి కలిగి ఉంటారంట.

ఒక చేతితో స్మార్ట్ ఫోన్ పట్టుకోని మరో చేయి చూపుడు వేలుతో ఫోన్ ఉపయోగించేవారు. ఇతరులకు అంత సులభంగా లొంగరంట. వీరికి జాగ్రత్తలు చాలా అవసరం. వీరు నిర్ణయం తీసుకునే సమయంలో ఒక ఆప్షన్‌ను తప్పకుండా చూసుకుంటారంట. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ.



Source link

Related posts

నీళ్లు ఎక్కువ తాగినా ఆరోగ్యానికి ప్రమాదమే.. రోజుకు ఎన్ని లీటర్లు తాగాలంటే..

Oknews

కడుపులో ఔషధంగా మారే ప్రత్యేకమైన స్వీట్..

Oknews

షుగర్ పేషెంట్లు టీ తాగడం సురక్షితమేనా?

Oknews

Leave a Comment