Latest NewsTelangana

pm modi photo in wedding invitation gone viral | Wedding Invitation: పెళ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫోటో


PM Modi Photo In Wedding Invitation: తమకు ఇష్టమైన నాయకులపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానం చాటుకుంటారు. ప్రస్తుతం ఎన్నికల వేడి నేపథ్యంలో నేతలు, వారి అభిమానుల ప్రచారం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా, తెలంగాణకు చెందిన ఓ యువకుడు తన పెళ్లి కార్డుపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ముద్రించి ఆయనకు ఓటు వేయాలంటూ అభ్యర్థించాడు. కొత్త ట్రెండ్ తో ప్రచారం నిర్వహించగా.. ఈ పెళ్లి పత్రిక ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

సంగారెడ్డి జిల్లా ఆరుట్లకు చెందిన ఓ యువకుడు ప్రధాని మోదీ, బీజేపీకి వీరాభిమాని. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరఫున వెరైటీగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తన పెళ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాడు. అంతే కాకుండా.. ‘నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి.. నరేంద్ర మోదీకి మీరు వేసే ఓటు.’ అని ప్రింట్ చేయించాడు. వీటిని తన బంధు మిత్రులు అందరికీ పంచగా.. ప్రచారంలో ఇదో కొత్త ట్రెండ్ అంటూ అంతా ఆశ్చర్యపోయారు. ఈ వెడ్డింగ్ కార్డు.. నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. 

Also Read: Phone Tapping In Telangana : ఉన్నతాధికారుల మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు- ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ సహా నలుగురి ఇళ్లల్‌లో సోదాలు

మరిన్ని చూడండి



Source link

Related posts

Telangana Govt Revealed the Bond between KCR And YS Jagan వీరి బంధం ఆ సిమెంట్ కంటే స్ట్రాంగ్

Oknews

Big twist before nominations in AP! ఏపీలో నామినేషన్ల ముందు బిగ్ ట్విస్ట్!

Oknews

Ram Mandir Inauguration Centre Issues Advisory To News Outlets Social Media Against Spreading Fake News

Oknews

Leave a Comment