GossipsLatest News

Pooja Hegde To Move In To New House ఖరీదైన ఇంటికి షిఫ్ట్ అవుతున్న బుట్ట బొమ్మ



Sat 13th Apr 2024 06:03 PM

pooja hegde  ఖరీదైన ఇంటికి షిఫ్ట్ అవుతున్న బుట్ట బొమ్మ


Pooja Hegde To Move In To New House ఖరీదైన ఇంటికి షిఫ్ట్ అవుతున్న బుట్ట బొమ్మ

టాప్ హీరోయిన్ కాస్తా ప్లాప్ హీరోయిన్ గా మారిపోయిన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో ఒకటి రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. వరసగా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న పూజ హెగ్డే ఫిజిక్, ఆమె గ్లామర్ ఆమెకి అదనపు ఆకర్షణ. నటన విషయంలో ద బెస్ట్ అని చెప్పలేం కానీ.. అలాగని మరీ పూర్ కాదు. అయితే స్టార్ హీరోలు వరసగా పూజ హెగ్డే కి షాకివ్వడంతో ఆమె కెరీర్ డోలాయమానంలో పడింది.

సౌత్ దర్శకనిర్మాతలెవరూ తమ ప్రాజెక్ట్స్ లో పూజ హెగ్డే ని హీరోయిన్ గా కన్సిడర్ చెయ్యడం లేదు. దానితో బుట్ట బొమ్మ సోషల్ మీడియాలో రకరకాల గ్లామర్ ఫోటో షూట్స్ ని షేర్ చేస్తుంది. అయితే పూజ హెగ్డే ఇప్పుడు మరోసారి న్యూస్ లో నిలిచింది. ఆమె రీసెంట్ గా తన మకాం ని ముంబైలోని కాస్ట్లీ ఏరియా అంటే బాలీవుడ్ అగ్ర తార‌లంతా కొలువుండే చోటు బాంద్రా కి మారుస్తుంది అని తెలుస్తోంది.

సముద్రానికి ఎదురుగా ఉన్న 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న అపార్ట్ మెంట్ లోకి పూజ హెగ్డే కాలు పెట్టబోతోంది. అద్భుత‌మైన విజువ‌ల్ బ్యూటీ ఉన్న ఇల్లు ఇది. అన్ని విధాలా సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌దేశంలో ఉండడంతో దీని ఖ‌రీదు అక్షరాలా 45 కోట్లు అని చెబుతున్నారు. ఎప్పటి నుంచో పూజ హెగ్డే ఈ ఇంటికి ఇంటీరియ‌ర్ స‌హా డిజైనింగ్ ప‌రంగా వ‌ర‌ల్డ్ క్లాస్ లో డిజైన్ చేయిస్తుంది అనే న్యూస్ ఉండనే ఉంది. మరి ఇప్పుడు ఈ కాస్ట్లీ అపార్ట్మెంట్ లోకి పూజ హెగ్డే వెళ్ళబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. 


Pooja Hegde To Move In To New House:

Pooja Hegde To Move In To New House With A Sea View 









Source link

Related posts

Better to be silent: Vishwak Sen సైలెంట్ గా ఉండడమే బెటర్: విశ్వక్ సేన్

Oknews

నందమూరి అభిమానులూ.. సంబరాలకు సిద్ధమేనా!

Oknews

చియాన్ విక్రమ్  బంగారు కుమారుడికి మండుతున్న నివాళి..పట్టుకోండి  

Oknews

Leave a Comment