ByGanesh
Sat 13th Apr 2024 10:07 AM
బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన మైదాన్ మూవీ రంజాన్ స్పెషల్ గా విడుదలైంది. హిందీలో ఈ చిత్రంపై విడుదలకు ముందు మంచి క్రేజ్ కనిపించింది. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రీమియర్స్ షోస్ తోనే సూపర్ మౌత్ టాక్ ని సొంతం చేసుకుంది. దానితో అజయ్ దేవగన్ మైదాన్ కి అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం ఖాయమనుకున్నారు.
మైదాన్ ప్రీమియర్స్ చూసిన బాలీవుడ్ క్రిటిక్స్, అలాగే ఇతర భాషల క్రిటిక్స్ కూడా అద్భుతమైన రేటింగ్స్ వేశారు. బాలీవుడ్ టాప్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఏకంగా 4 రేటింగ్స్ ఇచ్చారు. అంతేకాకుండా మైదాన్ చిత్రాన్ని తెగ పొగిడేశారు. సోషల్ మీడియా మొత్తం మైదాన్ మూవీ గురించే మాట్లాడుకున్నారు. అజయ్ దేవగన్ నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అయితే మైదాన్ ని థియేటర్స్ లో చూసే ప్రేక్షకులు కరువయ్యారు. అందుకే మైదాన్ కి దారుణమైం ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం మొదటి రోజు కేవలం 7.25 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే ఇండియాలో అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా కేవలం 10.7 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఇది బాలీవుడ్ కి డిజప్పాయింటింగ్ అంశం అని చెప్పక తప్పదు.
ఇక నిన్న శుక్రవారం కూడా కలెక్షన్స్ పరంగా మైదాన్ ఎలాంటి అద్భుతాలు సృష్టించలేదు. టాక్ అంత సూపర్ పాజిటివ్ ఉన్నప్పటికీ సినిమా చూసేందుకు ఇంకా ప్రేక్షకులు మాత్రం థియేటర్స్ కి తరలి రావడం లేదు.
Poor collections of super hit movie:
Maidaan Box Office Collection report