ByGanesh
Fri 12th Apr 2024 06:38 PM
ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి తరచూ స్టార్ హీరో ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ ఉండడంతో ప్రభాస్ ఫాన్స్ వేణు స్వామిని చాలా ట్రోల్ చేస్తూ ఉంటారు. ప్రభాస్ జాతకంపై తప్పుడు కథలు చెబుతాడు, ఆయన జాతకంలో పెళ్లి యోగం లేదు అంటూ వేణు స్వామి చేసే కామెంట్స్ కి ప్రభాస్ ఫాన్స్ కి చిర్రెత్తుకొస్తుంది. ఫాన్స్ మాత్రమే కాదు.. కృష్ణంరాజు గారి వైఫ్ శ్యామలాదేవి కూడా ప్రభాస్ జాతకం ఆయన తల్లి దగ్గర తప్ప ఇంకెవరికి తెలియదు, వేణు స్వామికి ఎలా తెలిసింది అంటూ చేసిన కామెంట్స్ పై కూడా వేణు స్వామి స్పందించాడు.
తాను ఎప్పుడు ప్రభాస్ ని టార్గెట్ చెయ్యలేదు, అంతెందుకు ఈమధ్యన మా ఆవిడ(శ్రీవాణి)తో కలిసి మిర్చి స్పూఫ్ కూడా చేశాను. అది చూసి ప్రభాస్ వేణు గారు చాలా స్టయిల్ గా ఉన్నారని అన్నాడు. అంతేకాదు మా తోటలో కాసిన సీతా ఫలాలు కూడా ప్రభాస్ కి పంపించాను. చాల బాగున్నాయి, మళ్ళీ ఉంటే పంపమని అడిగారు ప్రభాస్ అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చాడు.
అసలు శ్యామలాదేవి గారికి ప్రభాస్ గురించి ఏమి తెలియదు, నాకు కృష్ణం రాజు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. అయినా సెలబ్రిటీ హోదాలో నేను చెప్పే జాతకాల వలన నేను ఫేమస్ అవ్వడంతో నా మీద ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి, నెగిటివిటి పుడుతుంది అదంతా నేను పట్టించుకోను అంటూ వేణు స్వామి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ని టార్గెట్ చెయ్యడం లేదు అంటూ ప్రభాస్ ఫాన్స్ కి వివరించే ప్రయత్నమైతే చేసారు.
Prabhas fans vs Venu Swamy:
Venu Swamy Latest Comments On Prabhas