ByGanesh
Sat 24th Feb 2024 03:19 PM
ప్రస్తుతం ఫామ్ లో లేని ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి చేరుదామని కలలు కనింది. కానీ ప్రగ్య జైస్వాల్ కి అదృష్టము, టైమ్ రెండూ అస్సలు కలిసిరాలేదు. గ్లామర్ చూపించినా పని జరగలేదు. బాలకృష్ణ తో అఖండ మూవీలో చేసాక ప్రగ్య జైస్వాల్ మళ్ళీ టాలీవుడ్ లో కాస్త బిజీ అవుతుంది అనుకున్నారు. కానీ అమ్మడు ఆతర్వాత ఏ ప్రాజెక్ట్ లో కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో మాత్రం తాజా ఫొటోస్ తో ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా దర్శనమిస్తూ ఉంటుంది.
రీసెంట్ గా రకుల్ ప్రీత్ బ్యాచులర్ పార్టీలో హడావిడి చేసిన ప్రగ్యా జైస్వాల్ తాజాగా ముత్యాలు పొదిగిన డిజైనర్ వేర్ డ్రెస్సులో చూపు తిప్పుకోలేని అందంతో మత్తెక్కించేలాంటి ఫోటో షూట్ వదిలింది. సారీస్, గ్లామర్ డ్రెస్సులతో బ్యూటిఫుల్ గా కనిపించే ప్రగ్యా ఈ ముత్యాలు పొదిగిన మోడ్రెన్ డ్రెస్సులో మాత్రం మరింత అద్భుతంగా కనిపించింది. మరి ఇంత అందాన్ని టాలీవుడ్ ఎందుకు లైట్ తీసుకుంటుందో కదా.! మీరూ ప్రగ్య జైస్వాల్ కొత్త పిక్ ని ఓ లుక్కెయ్యండి.
Pragya sizzling in a pearl dress:
Pragya Jaiswal sizzling stills a Pearls dress