ByMohan
Fri 19th Jan 2024 08:22 PM
గుంటూరు కారం సినిమాకి మొదట వచ్చిన టాక్‌పై నిర్మాత ఎస్ నాగవంశీ స్పందించారు. కొందరు కావాలని టార్గెట్ చేశారనే అభిప్రాయాలున్నాయి. అలాగే అర్థరాత్రి ఒంటి గంట షోలు వేసి తప్పు చేశామని అనిపించింది. దాని వల్ల ప్రేక్షకులు మిస్ లీడ్ అయ్యారని అనిపించింది. దీనిని ఫ్యామిలీ సినిమాగా ముందు మేము ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లలేదు. పక్కా మాస్ ఫిల్మ్ అనుకొని, అభిమానులు ఏమైనా కాస్త నిరాశ చెందారేమో అనిపించింది. ఇప్పుడు సినిమా పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా సినిమాని ఈ స్థాయి వసూళ్లతో ఆదరిస్తూ, బయ్యర్లను నిలబెట్టిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు అని అన్నారు నిర్మాత నాగవంశీ. మొదటి వారంలోనే గుంటూరు కారం సినిమా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసిందని తెలిపేందుకు.. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
మా గుంటూరు కారం సినిమా విడుదలై గురువారానికి వారం రోజులు పూర్తయ్యాయి. కొందరి అంచనాలను తప్పని నిరూపిస్తూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టిందని తెలపడానికే ఈ మీడియా సమావేశం పెట్టాను. కొందరు మీడియా వారు ఎందుకో ఈ చిత్రాన్ని ఎక్కువగా ప్రేమించారు. డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్లకు ఫోన్ చేసి కూడా కలెక్షన్ల గురించి ఆరా తీశారు. ఈ సినిమా చాలా బాగా నడిచింది. బయ్యర్లు అందరూ బ్రేకీవెన్‌కి చేరువయ్యారు. సినిమాకి ఇంత మంచి ఆదరణ లభిస్తుంది కాబట్టే.. ధైర్యంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టాను అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. రివ్యూలు సినిమాపై ఎటువంటి ప్రభావం చూపలేదు. సినిమా విడుదలైన రోజు ఉదయం కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను గందరగోళానికి గురి చేశారు. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్, నార్మల్ ఆడియెన్స్ ఎప్పుడైతే సినిమాకి రావడం మొదలుపెట్టారో సాయంత్రానికి ఒక్కసారిగా సినిమా టాక్ మారిపోయింది. ఇది నేను చెప్పడం కాదు.. ఇప్పటి వరకు సాధించిన వసూళ్లే చెబుతున్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తల్లీకొడుకుల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అందుకే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయి.. వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు.
Producer S Naga Vamsi About Guntur Kaaram Success:
S Naga Vamsi Sensational Comments on Guntur Kaaram First Day Talk