ByGanesh
Thu 28th Mar 2024 10:11 AM
పుష్ప ద రూల్ షూటింగ్ విషయంలో సుకుమార్ చాలా సీరియస్ గా పని చేసుకుంటున్నారు. షూటింగ్ త్వరగా ఫినిష్ చెయ్యాలని డే అండ్ నైట్ ఆయన కష్టపడుతున్నారు. ఒక్కోరోజు అలిసిపోయి ఇంటికి వెళుతున్న సుకుమార్ అనుకున్న టైమ్ కి పుష్ప ద రూల్ ని రిలీజ్ చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆగష్టు 15 నుండి పుష్ప ద రూల్ తప్పుకోవచ్చనే వార్తలు ఒట్టి పుకార్లే అని.. ఖచ్చితంగా పుష్ప ద రూల్ అనుకున్న సమయానికే థియేటర్స్ లో విడుదలడం పక్కా అంటున్నారు.
మరోపక్క పుష్ప ద రైజ్ లో ఊ అంటావా మావా అంటూ సమంత చేసిన రచ్చ ఇప్పటికి మ్యూజిక్ ఆల్బమ్స్ లో టాప్ పొజిషన్ లోనే ఉంది. ఆ పాట కన్నా ఆమె గ్లామర్ బాగా హైలెట్ అయ్యింది. సో పుష్ప ద రూల్ లోను సమంత స్పెషల్ సాంగ్ తో పాటుగా.. ఓ కీ రోల్ లో అంటే కొన్ని డైలాగ్స్ ఉన్న కేరెక్టర్ లో మెరవబోతుంది.. పుష్ప రాజ్ కోసం మరోసారి సమంత రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం పుష్ప ద రూల్ లో సమంత నటిస్తుంది అనేది జస్ట్ ఒక రూమర్ మాత్రమే అని, సమంత పార్ట్2 లో కనిపించదని తెలుస్తోంది.
పుష్ప ద రూల్ లో స్పెషల్ సాంగ్ పుష్ప1 కన్నా మరింత హైప్ తీసుకురావడానికి ఎవ్వరూ ఊహించని తార కోసం సుకుమార్ ట్రై చేస్తున్నారు కానీ.. సమంతని మాత్రం తీసుకోవడం లేదు అని సమాచారం. ప్రస్తుతం బన్నీ తన ఫ్యామిలీతో దుబాయ్ లో ఉన్నాడు. అక్కడి నుంచి రాగానే అల్లు అర్జున్ కూడా పనిలోకి దిగిపోతాడని మే, జూన్ కల్లా పుష్ప ద రూల్ షూటింగ్ కంప్లీట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ కి పబ్లిసిటీకి సుకుమార్ సమయం కేటాయిస్తారని తెలుస్తోంది.
Pushpa 2: That’s not true:
Samantha is not acting in Pushpa 2