ByGanesh
Fri 02nd Feb 2024 12:34 PM
అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పుష్ప ద రైజ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ షూటింగ్ నిన్నమొన్నటివరకు కూల్ గానే కనిపించినా.. పుష్ప1 లో అల్లు అర్జున్ పక్కన కేశవ కేరెక్టర్ లో కనిపించిన జగదీశ్ ఓ కేసులో జైలుకెళ్ళడంతో.. పుష్ప మేకర్స్ అయోమయంలో పడ్డారు. ఒక యువతిని ట్రాప్ చేసి, బెదిరించి ఆమె సూసైడ్ కి కారణమైన జగదీశ్ ని పక్కా ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేసారు. పుష్ప ద రైజ్ లో అల్లు అర్జున్ పక్కన ట్రావెల్ చేసిన కేరెక్టర్ పుష్ప ద రూల్ లోను కీలకంగా ఉండడంతో సుకుమార్ అండ్ టీమ్ తలపట్టుకున్నారు, ఆందోళన పడ్డారు.
మరోపక్క జగదీశ్ కి బెయిల్ రాకపోవడంతో పుష్ప 2 విడుదల తేదీ కూడా మారొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మొన్నీమధ్యనే జగదీశ్ కండిషన్ బెయిల్ పై బయటికి వచ్చి పుష్ప సెట్స్ లో తన పని చేసుకుని వెళ్ళిపోతున్నాడు, యూనిట్ తో కూడా మాట్లాడకుండా తన సీన్స్ లో నటిస్తున్నాడు అన్నారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా జగదీశ్ కి బెయిల్ వచ్చింది, పుష్ప షూటింగ్ కి రెగ్యులర్ గా హాజరవుతూ ఉండడంతో యూనిట్ మొత్తం కూల్ గా కనిపిస్తుందట. ఇక జగదీశ్ బెయిల్ పై రావడంతో సుకుమార్ హుషారుగా ముందుగా అల్లు అర్జున్-జగదీశ్ కాంబో సీన్స్ కంప్లీట్ చేసేస్తున్నారట.
పుష్ప పార్ట్ 1 కన్నా ఎక్కువగా పుష్ప 2 లోనే జగదీశ్ కాంబో సీన్స్ ఉంటాయని, అందుకే పుష్ప మేకర్స్ అంతగా టెన్షన్ పడ్డారు, కానీ ఇప్పుడు జగదీశ్ రావడంతో టెన్షన్ ఫ్రీ మోడ్ లోకి యూనిట్ వచ్చినట్టుగా తెలుస్తోంది.
Pushpa team in cool mode:
Pushpa Actor Jagadeesh Bandari released on bail