Rahul Gandhi Tweet About YS Sharmila and Sunitha : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు వివేకానందా రెడ్డి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండించారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ఆయన ట్విట్టర్(X)లో పోస్టు చేశారు. మహిళలను అవమానించడం… వారిపై ఇలాంటి దాడి చేయడం పిరికిపందే చర్యగా అభివర్ణించారు. దురదృష్టవశాత్తు ఇటీవలే కాలంలో ఇది కొందరికి ఒక ఆయుధంగా మారిపోయిందని దుయ్యబట్టారు. వైఎస్ షర్మిల, సునీతపై జరిగిన ఈ అవమానకర దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. ఇద్దరికి పార్టీతో పాటు తన మద్దతుగా ఉంటుందని తన పోస్టులో రాసుకొచ్చారు రాహుల్ గాంధీ.