ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడుతా
‘‘ నా చుట్టూ ఉన్న సమజానికి నా వంతు మంచి చేయాలన్న లక్ష్యంతో రాజకీయ మార్గాన్న ఎంచుకున్న వ్యక్తిని. ఆ దిశనగానే ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎక్కడా అవినీతి, వ్యక్తిగత స్వార్ధం లేకుండా నీతి నిజాయితీగా పనిచేస్తూ వచ్చాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశాను. తెలంగాణలో తర్వాత రాజకీయ పరిణామాలు నన్ను ఎంతో కలిచివేశాయి. ప్రజా తెలంగాణ బదులు ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్తితి తయారైంది. కేసీఆర్ ప్రజా పాలకుని వలే కాకుండా తెలంగాణకు నిజాం రాజువలే పోకడలు పోతున్నారు. తెలంగాణలో ప్రజా రాజ్యం ఏర్పాటు దిశగానే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలుకు అనుగుణంగా ముందుకు నడిపించే శక్తి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను భాగస్వామి కావాలని అడుగు వేశాను. మునుగోడులో కేసీఆర్, అయన ఎమ్మెల్యేలు ఇక్కడే మకాం పెట్టినా.. నా మీద, బీజేపీ మీద మునుగోడు ప్రజలు అచంచల విశ్వాసాన్నే చూపారు. కేసీఆర్ అవినీతిని కక్కించి, కుటుంబ తెలంగాణ బదులు ప్రజాస్వామిక, బహుజన తెలంగాణ ఏర్పాటు చేసే సత్తా ఒక్క బీజేపీకే ఉంది. నేనే కాదు ముఖ్య నాయకులెవరూ బీజేపీని వీడరు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతున్నాము…’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సుదీర్ఘ ప్రకటనలో వివరించారు.