ByGanesh
Sun 11th Feb 2024 04:23 PM
ఒకప్పుడు టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసి స్టార్ హీరోలతో జత కట్టిన రకుల్ ప్రీత్ ఇప్పుడు టాలీవుడ్ కి పూర్తిగా దూరమైపోయింది. టాలీవుడ్ దర్శకులు పట్టించుకోవడం మానేశారు. బాలీవుడ్ లో జెండా పాతుదాం అని కలలు కన్న రకుల్ ప్రీత్ కి హిందీ కూడా కిక్ ఇవ్వలేదు. చిన్నా చితక హిట్స్ తోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ తో పెళ్ళికి సిద్దమవుతున్న రకుల్ ప్రీత్ కి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ తలపు తట్టినట్లుగా సమాచారం. భారతీయ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఇతిహాస గాధగా రామాయణాన్ని దర్శకుడు నితేష్ తివారి ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
దానికి సంబందించిన స్టార్స్ ని ఇప్పటికే ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యారు. అందులో రాముడిగా రన్బీర్ కపూర్ ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. సీతగా సాయిపల్లవి ఫిక్స్ అయినట్లుగా టాక్ ఉంది. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోపక్క కన్నడ స్టార్ హీరో యష్ రావణుడిగా చేస్తున్నాడు అనే టాక్ ఉంది. కైకేయిగా లారా దత్త, విభీషణుడిగా విజయ్ సేతుపతిలను ఫైనల్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఓ కీలక పాత్రకి రకుల్ ప్రీత్ ని ఎంపిక చేశారనే న్యూస్ వైరల్ గా మారింది.
అది కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న సూర్పణక పాత్ర కోసం రకుల్ ప్రీత్ ని ఎంపిక చేశారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఈ అందగత్తెను రావణాసురుడికి చెల్లెలిగా రామాయణం మేకర్స్ చూపించడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం గాసిప్ అనే ఈ న్యూస్ కన్ ఫర్మ్ అయితే రకుల్ దశ తిరిగినట్లే. మరి రకుల్ ఈ కేరెక్టర్ లో ఎంత కొత్తదనం చూపిస్తుందో చూద్దాం.
Rakul Preet in Ramayana:
Rakul Preet Singh To Play Shurpanakha In Ramayana?